Kushi 2: ఖుషీ సినిమాకు సీక్వెల్.. నేను రెడీ.. డైరెక్టర్ ఎస్ జే సూర్య ఆసక్తికర కామెంట్స్
ఖుషీ.. దర్శకుడు ఎస్ జే సూర్య తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ. తలపతి (Kushi 2)విజయ్, జ్యోతిక జంటగా వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 2000 సంవత్సరంలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది.

producer a m ratnam made interesting comments on the khushi sequel
Kushi 2: ఖుషీ.. దర్శకుడు ఎస్ జే సూర్య తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ. తలపతి విజయ్, జ్యోతిక జంటగా వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 2000 సంవత్సరంలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను తమిళ్ లో రీ-రిలీజ్ చేస్తున్నారు. శక్తి ఫిలిమ్స్ అదినేత శక్తివేల్ రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖుషి సినిమా నిర్మాత ఏ ఏం రత్నం, దర్శకుడు ఎస్ జె సూర్య(Kushi 2) ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఖుషి 2 చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Siddharth: హిట్స్ లేకపోయినా హాలీవుడ్ ఆఫర్.. కన్ఫర్మ్ చేసిన సిద్దార్థ్
ఇక ఈ కార్యక్రమంలో నిర్మాత ఏ ఏం రత్నం మాట్లాడుతూ.. “ఇపుడు దేశ వ్యాప్తంగా పార్ట్-2, సీక్వెల్స్ ల ట్రెండ్ నడుస్తోంది. కాబట్టి, నేను చేసిన సూపర్ హిట్ సినిమాల సీక్వెల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వాటిలో ‘ఖుషీ’ చాలా స్పెషల్. డైరెక్టర్ ఎస్ జే సూర్య ఓకే అంటే ఖుషీ పార్ట్ 2 చేయడానికి రెడీ. ఆ సినిమాలో హీరోగా విజయ్ కుమారుడు చేస్తారా? వేరేవాళ్లు చేస్తారా అనేది దర్శకుడి నిర్ణయం. అని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత డైరెక్టర్ ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. ” ఖుషి సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఈ సినిమాలోని పాటలను ప్రేక్షకుడిగా చాలా ఎంజాయ్ చేస్తాను. కానీ, టెక్నీషియన్‌గా కాదు. ఈ సినిమాకు కెమెరామెన్ గా జీవా అద్భుతమైన వర్క్ చేశారు. అలాగే నటుడు వివేక్ కూడా. ఈ ఇద్దరు ఇప్పుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం.
ఈ సినిమాతో నాకు తెలుగులో కూడా మంచి గుర్తింపు లభించింది. పవన్ కల్యాణ్, భూమిక ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. ఆ అవకాశం ఇచ్చిన నిర్మాత రత్నంకు నా ధన్యవాదాలు. ఖుషీ సినిమా ఒక ఎవర్ గ్రీన్ మూవీ. అది దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి” అని చెప్పుకొచ్చాడు. మరి ఖుషి రీ రిలీజ్ కి తమిళంలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.