Siddharth: హిట్స్ లేకపోయినా హాలీవుడ్ ఆఫర్.. కన్ఫర్మ్ చేసిన సిద్దార్థ్

బాయ్స్ సినిమాతో హీరోగా మారాడు సిద్దార్థ్(Siddharth). ఈ తరువాత తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, భావ, ఆట లాంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Siddharth: హిట్స్ లేకపోయినా హాలీవుడ్ ఆఫర్.. కన్ఫర్మ్ చేసిన సిద్దార్థ్

Hero Siddharth gets Hollywood opportunity

Updated On : September 21, 2025 / 12:44 PM IST

Siddharth: బాయ్స్ సినిమాతో హీరోగా మారాడు సిద్దార్థ్. ఈ తరువాత తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, భావ, ఆట లాంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కూడా (Siddharth)తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు కానీ, విజయం మాత్రం వరించలేదు. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ, పాపం బ్యాడ్ లక్ ఒక్క సినిమా కూడా ఆయనకు విజయాన్ని అందించలేకపోయాయి. మధ్యలో గృహం, చిన్ని లాంటి సినిమాలు కాస్త ఊరట కలిగించినా సరైన విజయం మాత్రం వరించలేదు అనే చెప్పాలి.

Manchu Manoj: పవనన్న చెప్పిన ఆ ఒక్క మాట.. నా జీవితాన్ని మార్చిసింది: మంచు మనోజ్

అయినప్పటికీ కెరీర్ లో మరో బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు సిద్దార్థ్. హాలీవుడ్ లో తెరకెక్కనున్న అన్‌కస్టమైజ్డ్‌ ఎర్త్‌ అనే వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకరించిన‌ట్లు సమాచారం. మొత్తం 8 ఎపిసోడ్‌లతో వస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ తమిళం, తెలుగు భాషల్లో కూడా తెరకెక్కనుంది. ఈ సిరీస్ లో ఫ్రిధా పింటో హీరోయిన్ గా నటిస్తుండగా.. రితేష్‌ భద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. వార్నర్‌ బ్రదర్స్‌ టెలివిజన్, జాన్‌వెల్స్‌ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సిరీస్ ను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది అని సమాచారం.

ఇక ఈ సిరీస్ గురించి దర్శకుడు రితేష్‌ భద్ర మాట్లాడుతూ.. ప్రేమ, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ తెరకెక్కనున్న ఈ వెబ్‌ సిరీస్‌ను ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది అని వెల్లడించారు. ఒక బాధ్యత గల గృహిణి. అనుకోకుండా తన మాజీ ప్రియుడిని చూస్తుంది. ఆ తరువాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి అనేది ఒక కథ. ఒక బిజినెస్ మ్యాన్ తన వ్యాపారం, ప్రేమను బ్యాలెన్స్‌ చేయలేక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది మరో కథ. ఇలాంటి రెండు వేరే వేరు కథలతో ఈ సిరీస్ రూపొందిస్తున్నట్టు వివరించారు దర్శకుడు. మరి చాలా కాలం తరువాత ఒక మంచి ప్రాజెక్టుతో వస్తున్న సిద్దార్థ్ సక్సెస్ ను అందుకుంటాడా అనేది చూడాలి.