కేనర్స్‌పై హీరో వైఫ్ ట్వీట్

వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా తాహిరా కశ్యప్ చేసిన ట్వీట్.. హార్ట్ టచింగ్‌గా ఉంది.

  • Publish Date - February 4, 2019 / 11:08 AM IST

వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా తాహిరా కశ్యప్ చేసిన ట్వీట్.. హార్ట్ టచింగ్‌గా ఉంది.

బాలీవుడ్ సెలబ్రిటీలను క్యాన్సర్ మహమ్మారి ఎంతగా ఇబ్బంది పెడుతుందో గతకొంత కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. మనీషా కోయిరాలా, సోనాలీ బింద్రే, ఇర్ఫాన్ ఖాన్, క్రికెటర్ యువరాజ్ సింగ్ వంటి వాళ్ళు క్యాన్సర్‌కి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. రిషీ కపూర్, హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా వైఫ్ తాహిరా కశ్యప్ కూడా క్యాన్సర్ బాధితురాలే.. ఇప్పటికే పలు సెషన్స్ ట్రీట్‌మెంట్ చేయించుకుంది. ఫిబ్రవరి 4 న వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆమె చేసిన ట్వీట్.. హార్ట్ టచింగ్‌గా ఉంది.

ఇవాళ నారోజు.. అందరికీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ శుభాకాంక్షలు.. మనం మనరోజుని గ్రాండ్‌గా జరుపుకోవాలి. ముందుగా మనం క్యాన్సర్‌పై ఉన్నఅపోహను తొలగించుకోవాలి.. అందుకే ఈ ఫోటోను పోస్ట్ చేస్తున్నాను. నా ఒంటిపై ఉన్న కత్తిగాట్లని ఓ గౌరవ చిహ్నంగా భావిస్తున్నాను. నేను రోగాన్నికాకుండా, దానిని ఎదుర్కొన్న తీరుని చెప్పడానికే ఈ పిక్‌ పోస్ట్ చేశాను అంటూ భావోద్వేగంతో ట్వీట్ చేసింది తాహీరా.. నెటిజన్స్ భారీగా ఈ పోస్టుకి లైకులు కొడుతున్నారు.