ఆయుష్మాన్ ఖురానా ‘బాల’ – నవంబర్ 15 విడుదల

ఆయుష్మాన్ ఖురానా, భూమి ఫడ్నేకర్, యామీ గౌతమ్ మెయిన్ లీడ్స్‌గా తెరకెక్కుతున్న కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. 'బాలా'.. నవంబర్ 15 విడుదల..

  • Publish Date - September 24, 2019 / 09:49 AM IST

ఆయుష్మాన్ ఖురానా, భూమి ఫడ్నేకర్, యామీ గౌతమ్ మెయిన్ లీడ్స్‌గా తెరకెక్కుతున్న కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘బాలా’.. నవంబర్ 15 విడుదల..

‘అంథా దున్’ సినిమాకు గానూ బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ గెలుచుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా మరో డిఫరెంట్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. భూమి ఫడ్నేకర్, యామీ గౌతమ్ ఫీమేల్ లీడ్స్‌గా తెరకెక్కుతున్న కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘బాలా’.. ‘ఆబా’, ‘స్త్రీ’ సినిమాల ఫేమ్ అమర్ కౌషిక్ దర్శకత్వంలో, మాడాక్ ఫిలింస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దినేష్ విజాన్ నిర్మిస్తున్నాడు.

ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటుంది. రీసెంట్‌గా బాల ప్రీ పోన్ అయింది.  ముందుగా బాల మూవీని నవంబర్ 22న విడుదల చెయ్యాలనుకున్నారు. ఇప్పుడు ఒక వారం ముందుగా నవంబర్ 15న సినిమా విడుదల కానుంది. బాల మూవీ ద్వారా ఆయుష్మాన్ మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నాడు.

Read Also : 20 ఏళ్ల తర్వాత ఉపేంద్ర రీ-రిలీజ్..

సౌరభ్ శుక్లా, జావేద్ జాఫ్రీ, సీమా పావా, అభిషేక్ బెనర్జీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. రచన : కరణ్ మల్హోత్రా, మ్యూజిక్ : సచిన్ – జిగార్, బ్యాగ్రౌండ్ స్కోర్ : జాన్ స్టీవార్ట్ అదూరి, సినిమాటోగ్రఫీ : అనూజ్ రాకేష్ ధావన్, ఎడిటింగ్ : హేమంతి సర్కార్, నిర్మాణం : మాడాక్ ఫిలింస్, జియో స్టూడియోస్..