×
Ad

Baa Baa Black Sheep : ‘బా బా బ్లాక్ షీప్’.. టైటిల్ భలే ఉందే.. క్రైమ్ కామెడీ..

తాజాగా దసరా సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కథ, కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. (Baa Baa Black Sheep)

Baa Baa Black Sheep

Baa Baa Black Sheep : గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే కథతో ఓ ముగ్గురి తెలివి తేటలు, ఒక రోజులో జరిగే ఘటనలు, ఓ ఆరుగురి ప్రయాణంతో సరికొత్త క్రైమ్ కామెడీగా తెరకెక్కుతుంది ‘బా బా బ్లాక్ షీప్’. దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనెపూడి నిర్మాణంలో గుణి మంచికంటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా దసరా సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కథ, కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.

Also Read : Mass Jathara : హమ్మయ్య ఇన్ని వాయిదాల తర్వాత ‘మాస్ జాతర’ వచ్చేస్తుంది.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్‌ రిలీజ్ చేసారు. ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే మరో సరికొత్త క్రైమ్ కామెడీ సినిమా రాబోతుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ ప్రారంభం కానుంది.