Baahubali The Epic
Baahubali The Epic : బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలను కలిపి బాహుబలి ఎపిక్ గా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు రాజమౌళి. బాహుబలి ఎపిక్ అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. మూవీ టీమ్ అంతా బాహుబలి సినిమా మీద వర్క్ చేస్తున్నారు. ఎడిటింగ్ లో కొంత భాగం తీసేసి రెండు సినిమాలను కలిపి దాదాపు 4 గంటల సినిమాగా కట్ చేయబోతున్నారు అని తెలుస్తుంది.(Baahubali The Epic)
అలాగే బాహుబలి ఎపిక్ ని మరోసారి కలర్ గ్రేడింగ్ చేస్తున్నారు. అంతే కాకుండా అప్పటికంటే బెటర్ గా ప్రేక్షకులకు బాహుబలి సినిమా అనుభూతిని ఇవ్వడానికి రాజమౌళి, ఆయన టీమ్ చాలానే కష్టపడుతున్నారు. అందుకోసం బాహుబలి సినిమా ప్రపంచంలోని వివిధ సినిమాటిక్ ఫార్మెట్స్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. మూవీ యూనిట్ ఒక్కొక్కటిగా ఆ ఫార్మెట్స్ ని ప్రకటిస్తూ వస్తుంది.
Also Read : Bunny Vasu : నా థియేటర్స్ కూడా వేరే సినిమాలకు ఇచ్చేస్తున్నాను.. ఇంతకంటే ఇంకేం చెప్పను..
మూవీ టీమ్ ప్రకటించిన దాని ప్రకారం బాహుబలి ఎపిక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా IMAX, Dolby Cinema, D Box, 4DX, EPIQ, ICE థియేటర్స్, PCX .. దాదాపు ఏడు ఫార్మెట్స్ లో రిలీజ్ కాబోతుంది. ఆయా ఫార్మెట్స్ కి తగ్గట్టు సినిమాని తయారుచేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ బాహుబలి సినిమాని థియేటర్స్ లో ఓ రేంజ్ లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఎదురుచూస్తున్నారు. రాజమౌళి కూడా ఈ విజువల్ వండర్ మీద బాగానే కేర్ తీసుకుంటున్నాడు.
Also See : Mamitha Baiju : స్టేజిపై స్టెప్పులేసిన ‘డ్యూడ్’.. ప్రేమలు బ్యూటీ మమిత బైజు క్యూట్ ఫొటోలు..