Bunny Vasu : నా థియేటర్స్ కూడా వేరే సినిమాలకు ఇచ్చేస్తున్నాను.. ఇంతకంటే ఇంకేం చెప్పను..

మిత్రమండలి ప్రెస్ మీట్ లో బన్నీ వాసు మాట్లాడుతూ.. (Bunny Vasu)

Bunny Vasu : నా థియేటర్స్ కూడా వేరే సినిమాలకు ఇచ్చేస్తున్నాను.. ఇంతకంటే ఇంకేం చెప్పను..

Bunny Vasu

Updated On : October 16, 2025 / 9:56 AM IST

Bunny Vasu : ఇటీవల మిత్రమండలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ వాసు నన్ను, నా సినిమాని తొక్కాలని చుస్తున్నారు. మాపై నెగిటివ్ ట్రోలింగ్ డబ్బులిచ్చి చేయించారు అని సంచలన వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్ లో చర్చగా మారింది. దీంతో దీనిపై టాలీవుడ్ నుంచి ఎవరో ఒకరు స్పందిస్తున్నారు.(Bunny Vasu)

బుధవారం రాత్రి మిత్రమండలి ప్రెస్ మీట్ నిర్వహించగా అందరూ అన్ని సినిమాలు బాగా ఆడాలి అని మీడియా ముందు చెప్తున్నారు, కానీ నెగిటివిటి చేస్తున్నారు అని అంటున్నారు అనే ప్రశ్న ఎదురవ్వగా బన్నీ వాసు స్పందించారు.

Also See : Mamitha Baiju : స్టేజిపై స్టెప్పులేసిన ‘డ్యూడ్’.. ప్రేమలు బ్యూటీ మమిత బైజు క్యూట్ ఫొటోలు..

బన్నీ వాసు మాట్లాడుతూ.. నా సొంత థియేటర్స్, నేను లీజుకు తీసుకున్న థియేటర్స్ లో నా సినిమాకు రెండు షోలు వేసుకొని, వేరే సినిమాకు రెండు షోలు ఇచ్చాను. గుడివాడ సింధూర థియేటర్ నాదైనా నా సినిమా కంటే పెద్ద సినిమాకే ఆ థియేటర్ ఇచ్చాను. నా సినిమా ఇంకో చిన్న థియేటర్ లో వేసుకున్నా. నా థియేటర్ ఉంది కదా అని నా సినిమా నాలుగు షోలు వేసుకోలేదు. వేరే సినిమాలకు కూడా రెండు షోలు ఇస్తున్నా. గీత ఫిలిమ్స్ ఆధ్వర్యంలో గోదావరి జిల్లాల్లో ఉన్న థియేటర్స్ లో కూడా వేరే సినిమాలకు కోపరేట్ చేస్తున్నాము. ఇంకా ఇంతకంటే ఏం చెప్పను నేను. నా సినిమా, నా సొంత డబ్బులు వదులుకొని అవతలి సినిమాకు థియేటర్స్ ఇస్తున్నాను అంటే సినిమాలు బాగుండాలని కోరుకున్నందుకే కదా అని అన్నారు.

Also See : Dude Pre Release Event : ‘డ్యూడ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు..