Baahubali The Eternal War
Baahubali The Eternal War : ఇటీవల బాహుబలి రెండు సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బాహుబలి సినిమాకు పార్ట్ 3 ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. ది ఎపిక్ రిలీజ్ సమయంలో రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో.. బాహుబలి 3 కాదు కానీ ది ఎటర్నల్ వార్ అనే సినిమా రాబోతుంది అని చెప్పాడు.(Baahubali The Eternal War)
బాహుబలి ది ఎపిక్ సినిమాకు థియేటర్స్ లో ‘బాహుబలి ది ఎటర్నల్ వార్’ టీజర్ కూడా జత చేసి చూపించారు. అది 3D యానిమేషన్ సినిమా. ఆ టీజర్ తోనే బాహుబలి ఎటర్నల్ వార్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ టీజర్ యూట్యూబ్ లో ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూసారు. నిన్న రాత్రి సడెన్ గా బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ రిలీజ్ చేసారు.
Also Read : Sravanthi Chokarapu : కార్తీక పౌర్ణమి స్పెషల్.. ఉదయాన్నే పూజ చేసి ఫోటోలు షేర్ చేసిన యాంకర్ స్రవంతి..
టీజర్ రమ్యకృష్ణ వాయిస్ ఓవర్ తో మొదలైంది. టీజర్ లో రమ్యకృష్ణ, బాహుబలి సన్నివేశాలు చూపిస్తూ.. బాహుబలి ప్రాణం పోసి పెంచుకున్న నా బిడ్డ. తన కోసం ఆ పరమశివుడు రాసిన గమ్యం ఏంటో నాకు తెలియలేదు. తన మరణం ఒక ముగింపు కాదు, ఓ మహా కార్యానికి ప్రారంభం. తన గమ్యం యుద్ధం, భూత వర్తమాన భవిష్యత్ కాలాలను శాసించే దేవాసుర సంగ్రామం అనే వాయిస్ తో ఎలివేషన్ ఇచ్చారు. బాహుబలి మరణం తర్వాత అతని ఆత్మా పై లోకాలకు వెళ్లి అక్కడ శివలింగం వద్ద నాట్యం చేస్తున్నట్టు చూపించారు. ఇంద్రుడు వచ్చి రాక్షసుడైన విషాసురతో బాహుబలి కోసం యుద్ధం చేసి అతన్ని ఓడించి.. బాహుబలిని ఎవరు కాపాడతారు ఇప్పుడు అని అడగడంతో బాహుబలి ఇంద్రుని ఐరావతం రథాన్ని తీసుకొని.. నాది అదే ప్రశ్న నిన్ను ఎవరు కాపాడతారు అని ప్రశ్నించాడు. చివర్లో ఈ 14 లోకాల మనుగడ ఒకే ఒక మానవుడి చేతిలో.. ఆ శక్తి పేరే బాహుబలి అంటూ ముగించారు.
మీరు కూడా బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ చూసేయండి..
టీజర్ బట్టి చూస్తుంటే బాహుబలి ఆత్మ పైలోకాలకు వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుంది, దేవతలు – రాక్షసుల మధ్య బాహుబలి ఎవరు అని సాగబోతున్నట్టు తెలుస్తుంది. యానిమేషన్ సినిమా కావడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ ఎటర్నల్ వార్ కూడా పార్ట్ 1 అని ప్రకటించారు. అంటే దీనికి కూడా రెండో పార్ట్ ఉంటుందని, ఈ ఫ్రాంచైజ్ లో మరిన్ని సినిమాలు వస్తాయని తెలుస్తుంది.
బాహుబలి ది ఎపిక్ రిలీజ్ సమయంలో రాజమౌళి ఇంటర్వ్యూలో ఎటర్నల్ వార్ సినిమా గురించి మాట్లాడుతూ.. అది బాహుబలి సినిమాకు కంటిన్యుటీనే ఉంటుంది. అయితే అది 3D యానిమేషన్ సినిమా. ఇషాన్ శుక్ల అనే 3D యానిమేషన్ డైరెక్టర్ దీనికోసం వర్క్ చేస్తున్నాడు. అతను కూడా కథకు కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. ఆల్రెడీ రెండున్నరేళ్లుగా ఆ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. 120 కోట్ల బడ్జెట్ తో బాహుబలి ఎటర్నల్ వార్ యానిమేషన్ సినిమా తెరకెక్కుతుంది. అందులో ట్విస్టులు ఉంటాయి, కథ కూడా కొత్తగా బాగుంటుంది. అన్ని బాహుబలి క్యారెక్టర్స్ ఉంటాయి, ఇంకా కొత్త పాత్రలు కూడా వస్తాయి అని తెలిపారు. మరి ఈ బాహుబలి ది ఎటర్నల్ వార్ థియేటర్స్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
Also See : Nara Lokesh : అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న నారా లోకేష్.. ఫొటోలు..