Baahubali The Eternal War
Baahubali The Eternal War : బాహుబలి 3 వస్తుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బాహుబలి రెండు సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్ గా రిలీజ్ చేయడంతో మరోసారి బాహుబలి ఫీవర్ నడుస్తుంది. అయితే బాహుబలి 3 లేదు కానీ బాహుబలి ఫ్రాంచైజ్ అనౌన్స్ చేసి సరికొత్త సినిమా ప్రకటించారు. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ ముందే రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో బాహుబలి ది ఎటర్నల్ వార్ అనే సినిమా రాబోతుంది అని చెప్పాడు.(Baahubali The Eternal War)
నేడు బాహుబలి ది ఎపిక్ థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఈ సినిమాతో పాటు ‘బాహుబలి ది ఎటర్నల్ వార్’ టీజర్ కూడా చూపించారు. ఇది 3D యానిమేషన్ సినిమా. టీజర్లో.. శివగామి బాహుబలిని ఎలా పెంచింది, బాహుబలి చనిపోయిన తర్వాత అతని ఆత్మ పై లోకాలకు వెళ్లడం, అక్కడ బాహుబలి శివలింగం వద్ద నాట్యం చేయడం, బాహుబలి కోసం దేవతలు – రాక్షసులు యుద్ధం చేయడం, బాహుబలి రాక్షసుల వైపు ఉన్న మంచి వ్యక్తిగా చూపించడం.. లాంటి సీన్స్ ఉన్నాయి. దీంతో టీజర్ తోనే ఈ యానిమేషన్ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
టీజర్ ప్రకారం చూస్తుంటే బాహుబలి చిన్నప్పటి సీన్స్ తో పాటు బాహుబలి చనిపోయాక అతని ఆత్మ పైలోకాలకు వెళ్లి ఏం చేసింది? అసలు బాహుబలి ఎవరు? మనిషి రూపంలో ఎందుకు పుట్టారు అనే కథ ఉంటుందేమో అని తెలుస్తుంది. బాహుబలి కోసం ఎందుకు రాక్షసులు, దేవుళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు? బాహుబలి మంచి రాక్షసుడా అనే కథ చూపించనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఎటర్నల్ వార్ టీజర్ తో ఫ్యాన్స్ కి మరింత ఆనందాన్ని ఇచ్చారు రాజమౌళి.
ఈ ఎటర్నల్ వార్ కూడా పార్ట్ 1 అని ప్రకటించారు. అంటే దీనికి కూడా రెండో పార్ట్ ఉంటుందని, ఈ ఫ్రాంచైజ్ లో మరిన్ని సినిమాలు వస్తాయని తెలుస్తుంది. ఇక రాజమౌళి ఇంటర్వ్యూలో ఎటర్నల్ వార్ సినిమా గురించి మాట్లాడుతూ.. అది బాహుబలి 3 కాదు. బాహుబలి ఎటర్నల్ వార్ అని ప్లాన్ చేశాను. అది బాహుబలి సినిమాకు కంటిన్యుటీనే ఉంటుంది. అయితే అది 3D యానిమేషన్ సినిమా. ఇషాన్ శుక్ల అనే 3D యానిమేషన్ డైరెక్టర్ దీనికోసం వర్క్ చేస్తున్నాడు. అతను కూడా కథకు కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. ఆల్రెడీ రెండున్నరేళ్లుగా ఆ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. 120 కోట్ల బడ్జెట్ తో బాహుబలి ఎటర్నల్ వార్ యానిమేషన్ సినిమా తెరకెక్కుతుంది. అందులో ట్విస్టులు ఉంటాయి, కథ కూడా కొత్తగా బాగుంటుంది. అన్ని బాహుబలి క్యారెక్టర్స్ ఉంటాయి, ఇంకా కొత్త పాత్రలు కూడా వస్తాయి అని తెలిపారు.
దీంతో బాహుబలి సినిమా కథ, కథనంలో రాజమౌళి పర్యవేక్షణ ఉన్నా ఈ ఎటర్నల్ వార్ సినిమాని పలు హాలీవుడ్ యానిమేషన్ సినిమాలకు పనిచేసిన ఇషాన్ శుక్లా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా 2026 లేదా 2027 లో వస్తుందని తెలుస్తుంది.
Baahubali the eternal war looks grand and epic, can’t wait for it.#BaahubaliTheEpic pic.twitter.com/mrHNmE5cxk
— Rick Sulgie (@Aloydinkan) October 29, 2025