Sai Rajesh : పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. రూ.2 లక్షలు విరాళం ఇచ్చిన బేబీ డైరెక్టర్

పవన్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు బేబీ డైరెక్టర్ సాయి రాజేష్. పవన్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీకి రూ.2 లక్షలు సాయం అందించారు.

Sai Rajesh

Sai Rajesh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు బేబీ డైరెక్టర్ సాయి రాజేష్. ఆయన పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీకి రూ.2 లక్షల రూపాయలు సహాయంగా అందించారు.

Madhilo Madhi : బేబి దర్శకుడు సాయి రాజేష్.. ‘మదిలో మది’ మూవీ ఫస్ట్ లుక్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్..

బేబీ సినిమా సక్సెస్ తరువాత డైరెక్టర్ సాయి రాజేష్‌కి ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ పెరిగింది. రాజేష్ కూడా అనేక కార్యక్రమాల్లో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. తాజాగా పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై తనకున్న అభిమానం చాటుకున్నారు. జనసేన పార్టీకి రూ.2 లక్షల రూపాయలు సాయం అందించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసారు. అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసిన వివరాలతో పాటు ‘స్పందించే మనసుకి, ఎదిరించే ధైర్యానికి, పోరాడే తత్వానికి ఎప్పటికీ అభిమానిని. మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఆనవాయితీగా రెండు లక్షల రూపాయలు జనసేన పార్టీకి ఆయన పుట్టినరోజు సందర్భంగా సపోర్ట్‌గా అందిస్తున్నాను’ అనే శీర్షికతో సాయి రాజేష్ పోస్ట్ పెట్టారు. మీ మంచి మనసుకి అభినందనలు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.

Naga Babu : బేబీ నిర్మాత SKN, దర్శకుడు సాయి రాజేష్ జనసేన కోసం ఎంతో పని చేశారు..

సాయి రాజేష్ గతంలో కూడా పవన్ అభిమాని కష్టంలో ఉంటే ఆదుకున్నారు. తన మేనల్లుడి గుండె ఆపరేషన్‌కి సాయం అందించమని అడిగిన పవన్ అభిమానికి రూ.50,000 సాయం చేశారు. బేబీ సినిమా తరువాత సాయి రాజేష్ కొత్త ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆయన నెక్ట్స్ ప్రాజెక్టు కూడా బేబీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్‌తో ఉండబోతోందని తెలుస్తోంది. కొత్త డైరెక్టర్‌తో ఈ సినిమా రాబోతోందని.. సాయి రాజేష్ ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్‌లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.