Madhilo Madhi : బేబి దర్శకుడు సాయి రాజేష్.. ‘మదిలో మది’ మూవీ ఫస్ట్ లుక్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్..
ప్రేమ కథా చిత్రాలకు జనాల నుంచి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. రీసెంట్‌గా బేబి సినిమా..

Baby Movie director Sai Rajesh releases Madhilo Madhi first look and release date
Madhilo Madhi : ప్రేమ కథా చిత్రాలకు జనాల నుంచి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. రీసెంట్‌గా బేబి (Baby) సినిమానే దానికి నిదర్శనం. యువతను ఆకట్టుకునే కథ, కథనాలతో సాయి రాజేష్ తీసిన బేబి సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాంటి కోవలోకి చెందే మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా మదిలో మది అనే చిత్రం రాబోతోంది. జై, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీతలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ప్రకాష్ పల్ల దర్శకత్వం వహించారు.
Bholaa Shankar : మెహర్ రమేష్‌తో సినిమా తీయమని చిరంజీవికి ఆ దర్శకుడు సలహా ఇచ్చాడట.. ఎవరో తెలుసా..?
ఎస్ కే ఎల్ ఎమ్ క్రియేషన్స్ మీద నేముకూరి జయకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బేబి మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మదిలో మది సినిమా ఆగస్ట్ 18న విడుదల కాబోతోంది. నేను ట్రైలర్‌ను చూశాను అద్భుతంగా ఉంది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
Pawan Kalyan Fans : త్రివిక్రమ్ పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం.. గురూజీ కోసం రంగంలోకి దిగిన థమన్..
ఆ మధ్య ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే బలగం మూవీ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా లాంచ్ అయిన టైటిల్ టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాకు షారుఖ్ సంగీతం, క్రాంతి నీల, రాజేష్ మధుమాల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.

Baby Movie director Sai Rajesh releases Madhilo Madhi first look and release date