Producer SKN : వరుస హిట్స్ కొడుతున్న నిర్మాత SKN.. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్‌కి భారీ విరాళం.. ఎంతో తెలుసా?

బేబీ దర్శకుడు, తన ఫ్రెండ్ సాయి రాజేష్ తో పాటు డైరెక్టర్ వసిష్ఠ వైస్ ప్రసిడెంట్స్ గా గెలవడంతో వారికి మద్దతుగా నిర్మాత SKN ఈ భారీ విరాళాన్ని ప్రకటించాడు.

Baby Movie Producer SKN Announce Huge Amount Donation to Telugu Film Directors Association

Producer SKN : నిర్మాత SKN ఒక మెగా ఫ్యాన్ గా ఇండస్ట్రీకి వచ్చి అంచలంచెలుగా గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో ఎదిగి ఇప్పుడు నిర్మాతగా మాస్ మూవీ మేకర్స్ స్థాపించి వరుస యూత్ సినిమాలు తీస్తూ హిట్స్ కొడుతున్నారు. గత సంవత్సరం బేబీ సినిమాతో భారీ సక్సెస్ సాధించిన నిర్మాత SKN ఇటీవలే ట్రూ లవర్ అనే తమిళ్ డబ్బింగ్ సినిమాతో కూడా హిట్ కొట్టారు. ఆల్రెడీ మరో మూడు లవ్ సినిమాలు అనౌన్స్ చేశారు SKN(శ్రీనివాస కుమార్).

తాజాగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కి నిర్మాత SKN ఏకంగా 10 లక్షల రూపాయల విరాళం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. నేడు ఉదయం తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరగగా ఇందులో గుడుంబా శంకర్ దర్శకుడు వీర శంకర్ నేతృత్వంలోని ప్యానల్ ఘన విజయం సాధించింది. ఈ ప్యానల్ లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన వీరశంకర్ తో పాటు వైస్ ప్రసిడెంట్ గా పోటీ చేసిన డైరెక్టర్స్ సాయి రాజేష్(Sai Rajesh), వశిష్ట కూడా గెలిచారు.

Also Read : Harish Shankar : ‘ఈగల్’ సక్సెస్ మీట్‌లో ఫైర్ అయిన హరీష్ శంకర్.. దమ్ముంటే నా ఫోటో పెట్టి రాయి అంటూ..

బేబీ దర్శకుడు, తన ఫ్రెండ్ సాయి రాజేష్ తో పాటు డైరెక్టర్ వసిష్ఠ వైస్ ప్రసిడెంట్స్ గా గెలవడంతో వారికి మద్దతుగా నిర్మాత SKN ఈ భారీ విరాళాన్ని ప్రకటించాడు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం కోసం ఈ 10 లక్షల రూపాయలని ప్రకటించినట్టు తెలిపారు. నిర్మాత SKN ఇంత భారీ విరాళం ఇవ్వడంతో ఆశ్చర్యపోతూనే అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుల సంఘానికి ఒక నిర్మాత ఇలా విరాళం ఇవ్వడం, ఇంత ఎక్కువ అమౌంట్ ఇవ్వడంపై అందరూ అభినందనలు కురిపిస్తున్నారు.