Harish Shankar : ‘ఈగల్’ సక్సెస్ మీట్‌లో ఫైర్ అయిన హరీష్ శంకర్.. దమ్ముంటే నా ఫోటో పెట్టి రాయి అంటూ..
చాలా ఆవేశంగా సీరియస్ గా ఆ సైట్ పై ఫైర్ అయ్యాడు హరీష్. మధ్యలో రవితేజ వచ్చి ఆపాలని చూసిన హరీష్ ఆగలేదు. హరీష్ సీరియస్ గా మాట్లాడిన మాటలు ఇక్కడ చూసేయండి.

Harish Shankar Fires in Eagle Movie Success Meet Video goes Viral
Harish Shankar : కార్తీక్ ఘట్టమేనేని(Karthik Ghattamaneni) దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రవితేజ(Raviteja) హీరోగా తెరకెక్కిన ఈగల్ సినిమా ఇటీవల ఫిబ్రవరి 9న రిలీజయి మంచి విజయం సాధించింది. ఒక మాస్ స్టైలిష్ యాక్షన్ సినిమాతో థియేటర్స్ లో అదరగొడుతున్నారు రవితేజ. ఇప్పటికే రెండు రోజుల్లోనే ఈ సినిమా 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు చిత్రయూనిట్.
ఈగల్ సక్సెస్ మీట్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా గెస్ట్ గా వచ్చారు. అయితే ఈగల్ సినిమాపై ఒక వెబ్ సైట్ నెగిటివ్ రివ్యూలు రాయడంతో పాటు, మూవీ యూనిట్ ని, డైరెక్టర్ ని పర్సనల్ గా కూడా టార్గెట్ చేసి ట్రోల్ చేసింది. దీనిపై ఆల్రెడీ నిర్మాణ సంస్థ కౌంటర్ ఇచ్చింది. తాజాగా ఆ సైట్ పై హరీష్ శంకర్ విరుచుకుపడ్డారు. వాళ్ళు గతంలో రాసిన న్యూస్, చేసిన కామెంట్స్ కూడా బయటకి తీసి కౌంటర్లు వేసాడు. చాలా ఆవేశంగా సీరియస్ గా ఆ సైట్ పై ఫైర్ అయ్యాడు హరీష్. మధ్యలో రవితేజ వచ్చి ఆపాలని చూసిన హరీష్ ఆగలేదు. హరీష్ సీరియస్ గా మాట్లాడిన మాటలు ఇక్కడ చూసేయండి.
ఇక హరీష్ శంకర్ మాట్లాడిన దానికి రచయిత BVS రవి మద్దతు పలుకుతూ మాట్లాడాడు. రవితేజ కూడా.. హరీష్ శంకర్ బాగా మాట్లాడవు అంటూ హత్తుకొని ఆ సైట్ కి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు.