Balagam Movie collects 100 international awards creates new record
Balagam Movie : కమెడియన్ వేణు(Venu) దర్శకుడిగా మారి ప్రియదర్శి(Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) జంటగా దిల్ రాజు(Dil Raju) కూతురు హన్షిత రెడ్డి(Hanshitha Reddy) నిర్మాణంలో తెరకెక్కిన సినిమా బలగం. చిన్న సినిమాగా రిలీజయి పెద్ద విజయం సాధించింది. మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించిన సినిమా బలగం(Balagam) కలెక్షన్స్ తో పాటు పేరు, అవార్డులు కూడా సంపాదించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి అభినందనలు భారీగా వచ్చాయి.
ఇప్పుడున్న రోజుల్లో థియేటర్స్ లో ఈ చిన్న సినిమా 50 రోజులు ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఓటీటీలోకి వచ్చాక కూడా అత్యధిక వ్యూస్ తెచ్చుకొని రికార్డ్ సృష్టించింది. బలగం సినిమా కేవలం 2 కోట్లతో తీయగా దాదాపు 15 కోట్లు కలెక్ట్ చేసింది. అంతర్జాతీయంగా పలు అవార్డు వేడుకలకు బలగం సినిమాని పంపించగా ఇప్పటికే అనేక అవార్డులని అంతర్జాతీయ స్థాయిలో అందుకుంది. తాజాగా అవార్డుల్లో బలగం సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించింది.
ఇప్పటివరకు బలగం సినిమా ఏకంగా 100 అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా డైరెక్టర్ వేణు, చిత్రయూనిట్ తెలిపారు. డైరెక్టర్ వేణు 100 అవార్డుల పోస్టర్ షేర్ చేస్తూ.. అద్భుతమైన సినిమా. ఒకప్పుడు 100 రోజులు, ఆ తర్వాత 100 సెంటర్లు, ఆ తర్వాత 100 కోట్లు అని సినిమాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 100 అంతర్జాతీయ అవార్డులు సాధించాం. బలగం చాలా స్పెషల్ సినిమా అని ట్వీట్ చేసాడు. దీంతో పలువురు ప్రముఖులు, నెటిజన్లు డైరెక్టర్ వేణుకి, బలగం చిత్రయూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు.
A journey of Excellence and Recognition! ❤️
Earlier, we had
Films running for 100 days..
Films running in 100 centers..
Films collecting 100 crores ..Now, we have achieved a film with 100+ international awards ❤️#Balagam is a special film for many reasons ??#balagam pic.twitter.com/26yfgS8sse
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) July 4, 2023