Balagam Movie: మరో ఇంటర్నేషనల్ అవార్డును దక్కించుకున్న బలగం మూవీ
టాలీవుడ్ లో బలగం మూవీ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ సినిమా వరుసగా అంతర్జాతీయ అవార్డులను అందుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
- Anil Aaleti
- Published On : April 6, 2023 / 07:51 PM IST
Balagam Movie Gets Another International Award
Balagam Movie: టాలీవుడ్‌లో ఎప్పుడు ఏ సినిమా సక్సెస్ అందుకుంటుందో ఎవరూ చెప్పలేదు. భారీ అంచనాలతో రిలీజ్ అయ్యే సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడితే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. తాజాగా ఇలాంటి కోవలోకే ‘బలగం’ మూవీ కూడా వచ్చి చేరింది. దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కించిన పక్కా ఎమోషనల్ డ్రామా మూవీ ‘బలగం’ ఎలాంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యింది.
ఈ సినిమాను మార్చి 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయగా, ఈ చిత్రానికి తెలుగు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తూ దూసుకెళ్లింది. ఇక ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయినా కూడా ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక ఈ సినిమా అంతర్జాతీయంగానూ సంచనలం క్రియేట్ చేస్తూ వెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో ఏకంగా 6 అవార్డులను అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా, మరో అంతర్జాతీయ అవార్డును బలగం సినిమా అందుకుంది.
Balagam Movie: అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన ‘బలగం’.. ఏకంగా రెండు అవార్డులు!
ఏథెన్స్ ఇంటర్నేషనల్ మంత్లీ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ సౌండ్ డిజైన్ విభాగంలో బలగం మూవీ అవార్డును అందుకుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులకు బలగం సినిమాను పంపినట్లుగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దీంతో ఈ సినిమా మున్ముందు ఇంకెన్ని అవార్డులను అందుకుంటుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా, ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.
