×
Ad

Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అఖండ 2 మళ్ళీ వాయిదా..?

నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2: తాండవం. మాస్ చిత్రాల దర్శకుడు (Akhanda 2)బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Balakrishna Akhanda 2 movie to be postponed for Sankranthi 2026

Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2: తాండవం. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే, ఈ(Akhanda 2) సినిమా విడుదల కోసం ఆడియన్స్ మరీ ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ప్రమోస్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. నవంబర్ 14న అఖండ 2: తాండవం సినిమా నుంచి మొదటిపాట విడుదల కానుంది. ఈ పాట విడుదల తరువాత సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరుగుతాయని మేకర్స్ భావిస్తున్నారు.

Divya Bharathi: ఓరచూపుతో కవ్విస్తున్న దివ్య భారతి.. ఎద అందాలతో పరువపు వల.. ఫోటోలు

అయితే, అఖండ 2 సినిమా విడుదల గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అదే రోజు పవన్ కళ్యాణ్ ఓజీ విడుదల ఉన్న కారణంగా ఈ సినిమాను వాయిదా వేశారు. ఆ తరువాత డిసెంబర్ 5న ఖచ్చితంగా ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అప్పటి నుంచి డిసెంబర్ 5 కోసం బాలయ్య ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా డిసెంబర్ 5 నుంచి కూడా పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది.

డిసెంబర్ 5 నుంచి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసి 2026 సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారట మేకర్స్. ఇప్పటికే సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు, రాజసాబ్,భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒకరాజు, జన నాయకుడు లాంటి సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే ఒక రేంజ్ లో కాంపిటీషన్ ఏర్పడింది. ఇప్పుడు బాలయ్య కూడా ఎంటర్ అయ్యాడు అంటే ఆ వార్ ఒక రేంజ్ లో ఉండబోతుంది అను క్లియర్ గా అర్థం అవుతుంది. అయితే, ఈ వాయిదా విషయంపై మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటివరకైతే ఇది రూమర్ గానే ఉంది. నవంబర్ 14న సాంగ్ విడుదల అయితే విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.