బాలయ్య కోసం సి.కళ్యాణ్, ‘రూరల్’ అనే టైటిల్‌ని ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించాడని తెలుస్తుంది..
జై సింహా తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో, సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించబోయే ప్రాజెక్ట్‌కి సంబంధించి రోజురోజుకీ కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. రీసెంట్‌గా వరలక్ష్మీ శరత్ కుమార్ బాలయ్య పక్కన హీరోయిన్‌గా నటించనుందని ఒకరంటే, లేదు.. సినిమాలో ఆమెది నెగెటివ్ క్యారెక్టర్ అని మరొకరు అంటున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాకోసం మూవీ మేకర్స్ ఒక పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
బాలయ్య కోసం సి.కళ్యాణ్, ‘రూరల్’ అనే టైటిల్‌ని ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించాడని అంటున్నారు. బాలయ్య పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడని తెలుస్తుంది. లెజెండ్ తర్వాత జగపతి బాబు ఈ సినిమాలో విలన్‌గా నటించనుండగా, గౌతమిపుత్ర శాతకర్ణి, జై సింహా సినిమాలకు సంగీతమందిచిన చిరంతన్ భట్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందించబోతున్నాడు. త్వరలో ఈ సినిమా పూజాకార్యక్రమాలతో ప్రారంభం కానుంది.