Bhagavanth Kesari : మూడు రోజుల భగవంత్ కేసరి కలెక్షన్స్.. ఈసారి సెంచరీ..!

నంద‌మూరి బాల‌కృష్ణ భగవంత్ కేసరి.. బాక్సాఫీస్ కలెక్షన్స్ లో దూకుడు చూపిస్తూ ముందుకు వెళ్తుంది.

Balakrishna Bhagavanth Kesari Movie Three Days Collections Details

Bhagavanth Kesari : నంద‌మూరి బాల‌కృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన యాక్షన్ ఎమోషనల్ మూవీ ‘భగవంత్ కేసరి’. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో మాత్రం దూకుడు చూపిస్తూ ముందుకు వెళ్తుంది. మొదటిరోజే రూ.32.33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టిన ఈ సినిమా సెకండ్ హాఫ్ సెంచరీ కొట్టేసింది.

రెండో రోజు 18 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి మొత్తం మీద 51.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని నమోదు చేసింది. తాజాగా చిత్ర నిర్మాతలు మూడో రోజు కలెక్షన్స్ ని తెలియజేశారు. మూడో రోజు ఈ మూవీ 19 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది. దీంతో మొత్తం మీద బాక్సాఫీస్ వద్ద రూ.71.02 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని నమోదు చేసింది. ఇక నేడు ఆదివారం కావడంతో.. కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. కాగా బాలకృష్ణ గత చిత్రం వీరసింహారెడ్డి నాలుగు రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది.

Also read : Bigg Boss 7 : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7.. నేడు షో టైమింగ్ మార్పు.. ఎమోష‌న‌ల్ అయిన శోభాశెట్టి

ఇక ఇప్పుడు కూడా బాలకృష్ణ భగవంత్ కేసరితో నాలుగు రోజుల్లోనే సెంచరీ సాధిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. కానీ అది కష్టంలా కనిపిస్తుంది. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 65 కోట్ల వరకు జరిగిందని సమాచారం. అంటే ఈ చిత్రం దాదాపు 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.
ఇప్పుడు ఉన్న కలెక్షన్స్ జోరు చూస్తుంటే.. మొదటి వారం పూర్తి అయ్యేలోపే బాలకృష్ణ బ్రేక్ ఈవెన్ సాధించేలా ఉన్నాడు. ఇక ఈ చిత్రం వరుసగా మూడుసార్లు 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టినట్లు కూడా బాలయ్య రికార్డు సృష్టిస్తాడు.