Bigg Boss 7 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7.. నేడు షో టైమింగ్ మార్పు.. ఎమోషనల్ అయిన శోభాశెట్టి
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో దసరా సంబరాలు జరిగాయి. ఆదివారానికి సంబంధించిన ప్రొమో వచ్చేసింది. హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరూ బతుకమ్మ ఆడారు.

Bigg BossTelugu 7 Day48 promo
Bigg BossTelugu 7 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో దసరా సంబరాలు జరిగాయి. ఆదివారానికి సంబంధించిన ప్రొమో వచ్చేసింది. హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరూ బతుకమ్మ ఆడారు. హీరోయిన్స్ డింపుల్ హయతి, పాయల్ రాజ్‌పుత్ లతో పాటు మరికొందరు బిగ్ బాస్ స్టేజీ పై తమ డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారు. అలాగే కంటెస్టెంట్లతో కొన్ని సరదా ఆటలు ఆడింపిచాడు నాగార్జున. ఆతరువాత పండుగ సందర్భంగా కంటెస్టెంట్లకు వారి ఇంటి సభ్యులు రాసిన ఉత్తరాలను అందించారు.
శోభాశెట్టి, యావర్, తేజలు ఉత్తరాలను చదివి ఎమోషనల్ అయ్యారు. ఇక ఆఖర్లో నాగార్జున ట్విస్ట్ ఇచ్చారు. గతవారం ఎలిమినేట్ అయిన వాళ్లలో రతిక, దామిని, శుభ శ్రీ లను తీసుకువచ్చి.. వీరిలో ఎవరు రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారో ఇంటి సభ్యులు చెప్పాలని బిగ్‌బాస్ ఓటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎవరికి తక్కువ ఓట్లు వచ్చాయో వారే రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా.. దసరా సందర్భంగా రీ ఎంట్రీ ప్లాన్ చేశారు. కాగా.. వీరిలో రతిక రీ ఎంట్రీ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ వారం పూజామూర్తి ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు టాక్. ఎవరు ఎలిమినేట్ అయ్యారు. ఎవరు రీ ఎంట్రీ ఇచ్చారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. కాగా.. దసరా సందర్భంగా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు షో ప్రారంభం కానుంది. రేపటి నుంచి యథావిధిగానే షో ప్రసారం కానుంది.