Balakrishna: బాలయ్యతో నాలుగో హిట్ కొట్టేందుకు బోయపాటి ముహూర్తం ఫిక్స్ చేశాడా..?
నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో గతంలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే, తమ కాంబినేషన్ లో రాబోయే నాలుగో సినిమాను అనౌన్స్ చేసేందుకు బోయపాటి ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
- Anil Aaleti
- Published On : March 25, 2023 / 09:53 PM IST
Balakrishna Boyapati Sreenu Movie To Be Announced On This Day
Balakrishna: నందమూరి బాలకృష్ణ సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి మూవీతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా, బాలయ్య పవర్‌ఫుల్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తన కెరీర్‌లోని 108వ చిత్రాన్ని NBK108 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నాడు.
Balakrishna : తారకరత్నకు జరిగినట్లు ఎవరికీ జరగకూడదని.. మరోసారి బాలయ్య మంచితనం..
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని విధంగా చూపెట్టడంతో ప్రేక్షకుల్లో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు షూటింగ్ ముగిస్తారా.. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమా తరువాత బాలయ్య తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుతో చేసేందుకు రెడీ అవుతున్నాడు.
Nandamuri Balakrishna : ”వై నాట్ 175” అని సీఎం జగన్ ఇప్పుడంటే వినాలని ఉంది-బాలకృష్ణ
వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలవడంతో, ఇప్పుడు నాలుగో బ్లాక్‌బస్టర్‌ను రెడీ చేస్తున్నాడట బోయపాటి. అయితే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ నెలలో చేయబోతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, బాలయ్య అభిమానులకు అది నిజమైన పండగ అని పలువురు కామెంట్ చేస్తున్నారు.
