Daaku Maharaaj Collections : బాలయ్య ‘డాకు మహారాజ్’ మూడు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

సరికొత్త అవతారంలో బాలయ్య డాకు మహారాజ్ గా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

Balakrishna Daaku Maharaaj Three Days Collections

Daaku Maharaaj Collections : బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా జనవరి 12న రిలీజయి పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. బాలయ్య ఫ్యాన్స్ కి కావాల్సిన యాక్షన్ తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉండటంతో ఫ్యామిలీలు కూడా కనెక్ట్ అవుతున్నారు. సరికొత్త అవతారంలో బాలయ్య డాకు మహారాజ్ గా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. మొదటి రోజే ఈ సినిమా 56 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాలయ్య కెరీర్ హయ్యెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది.

Also See : Pragya Jaiswal : బాలయ్య, డాకు మహారాజ్ టీమ్ తో ప్రగ్య జైస్వాల్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు చూశారా?

తాజాగా మూడు రోజుల్లో డాకు మహారాజ్ సినిమా 92 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రెండో రోజు 18 కోట్లు సాధించగా మూడో రోజు మరో 18 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నేటి కలెక్షన్స్ తో ఈజీగా 100 కోట్ల గ్రాస్ దాటేస్తుంది డాకు మహారాజ్ సినిమా.

 

టాలీవుడ్ సమాచారం ప్రకారం డాకు మహారాజ్ సినిమా హిట్ అవ్వాలంటే 160 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఇంకా సంక్రాంతి హాలీడేస్ ఉండటం, సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈజీగా కలెక్షన్స్ వస్తాయని తెలుస్తుంది. వరుసగా బాలయ్య ఈ సినిమాతో నాలుగో హిట్ కొట్టాడు. అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి సినిమాల తర్వాత మరోసారి 100 కోట్లకు పైగా సాధించి డాకు మహారాజ్ తో సక్సెస్ కొడుతున్నారు బాలయ్య.

ఇక ఈ సినిమా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, సచిన్ ఖేద్కర్, చాందిని చౌదరి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

Also See : Keerthy Suresh : పెళ్లి తర్వాత మొదటి సంక్రాంతి.. భర్తతో కీర్తి సురేష్ సెలబ్రేషన్స్ ఫోటోలు చూశారా?