Balakrishna Fans Trolling Shaakuntalam director Gunasekhar
Gunasekhar : టాలీవుడ్ లో ఒకప్పుడు భారీ సినిమాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు గుణశేఖర్. భారీ సెట్స్ తో ఆడియన్స్ థ్రిల్ ఫీల్ చేసేవాడు. తాజాగా ఈ దర్శకుడు శాకుంతలం (Shaakuntalam) అనే మైథలాజికల్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఈ సినిమాలో మెయిన్ లీడ్ చేసింది. నిన్న (ఏప్రిల్ 14) రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్సడ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో బాలయ్య (Balakrishna) ఫ్యాన్స్ గుణశేఖర్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. సమంత సినిమా పై బాలయ్య అభిమానుల రియాక్షన్ ఏంటని ఆలోచిస్తున్నారా?
NBK108 : యాక్షన్ సీక్వెన్స్‌లో బాలయ్య.. NBK108 నుంచి వీడియో లీక్!
గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రుద్రమదేవి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు చరిత్రకు సంబంధించిన కథతో తెరకెక్కడంతో వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలని గుణశేఖర్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరాడు. కానీ అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆ సినిమాకి మినహాయింపు ఇవ్వలేదు. అయితే ఆ తరువాత వచ్చిన బాలకృష్ణ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి మాత్రం పన్ను మినహాయింపు ఇచ్చారు.
Gunasekhar: ఆ విషయంలో హీరోలు బన్నీని ఫాలో కావాలి – గుణశేఖర్
దీంతో ఆ సమయంలో గుణశేఖర్ రుద్రమదేవి చిత్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ‘ప్రశ్నించడం తప్పా?’ అనే ఒక ఓపెన్ లెటర్ ను రిలీజ్ చేశాడు. అప్పటిలో అది చర్చనీయాంశం అయింది. ఇక ఇప్పుడు శాకుంతలంకి మిక్సడ్ టాక్ రావడంతో బాలయ్య అభిమానులు.. అప్పుడు గుణశేఖర్ పోస్ట్ చేసిన లెటర్ ని పోస్ట్ చేస్తూ, ప్రశ్నించడం తప్పా అనే హ్యాష్ ట్యాగ్ తో గుణశేఖర్ ని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.
Karma is Gunashekhar!! @Gunasekhar1#Shakuntalam ? pic.twitter.com/LZez3fl0Hm
— #NBK108 (@NTR_NBK_CULT) April 14, 2023