NBK108 : యాక్షన్ సీక్వెన్స్‌లో బాలయ్య.. NBK108 నుంచి వీడియో లీక్!

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న NBK108 నుంచి వీడియో లీక్ అయ్యింది.

NBK108 : యాక్షన్ సీక్వెన్స్‌లో బాలయ్య.. NBK108 నుంచి వీడియో లీక్!

Video leak from NBK108 Balakrishna Kajal Agarwal Sree Leela

NBK108 : నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ప్రస్తుతం తన 108వ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే పనిలో ఉన్నాడు. అనిల్ రావిపూడి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే దర్శకుడు తెలియజేశాడు. ఇక ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన బాలయ్య ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య మాస్ డైలాగ్స్ చెబుతుంటే ఆ మజానే వేరుంటుంది. అలాంటిది ఆ మాస్ డైలాగ్స్ ని తెలంగాణ యాసలో చెబితే ఇంకెలా ఉంటుందో అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.

Nandamuri Balakrishna: నాకు మించిన సైకాలజిస్ట్ లేరు, నేను అందరి సైకాలజీ చెబుతా..

ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకొని ఈ చిత్రం కొత్త షెడ్యూల్ నేడు (ఏప్రిల్ 14) హైదరాబాద్ లో మొదలైంది. ఈ షెడ్యూల్ హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాన్ని తెరక్కించనున్నారట. ఇక సెట్స్ నుంచి ఒక వీడియో బయటకి వచ్చింది. ఆ వీడియోలో ఫైట్ కోసం ఉస్ చేసే క్రేన్, రోప్స్ అండ్ సెట్ ప్రోపర్టీస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ శ్రీలీల ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతుంది. ఇటీవలే ఈ భామలు ఇద్దరు కూడా NBK108 సెట్ లోకి అడుగు పెట్టారు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలయ్య లాస్ట్ రెండు సినిమాలు అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు కూడా థమన్ సంగీతం అందించాడు. ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడం, థమన్ సంగీతం కూడా కీ రోల్ ప్లే చేయడంతో.. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ కూడా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.