Nandamuri Balakrishna: నాకు మించిన సైకాలజిస్ట్ లేరు, నేను అందరి సైకాలజీ చెబుతా..

వైసీపీ ప్రభుత్వం పై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదని, పరిశ్రమలు లేవని అన్నారు. ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇచ్చే పరిస్థితి లేదన్నారు. గంజాయిలో మాత్రం దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని విమర్శించారు.

Nandamuri Balakrishna: నాకు మించిన సైకాలజిస్ట్ లేరు, నేను అందరి సైకాలజీ చెబుతా..

Nara Lokesh, Balakrishna (Pic: Twitter)

Nandamuri Balakrishna: రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది, పరిశ్రమలు లేవు, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన బాలకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మెగా బైట్లు గిగా బైట్లు అంటే ముఖ్యమంత్రికి తెలుసా అని బాలకృష్ణ ప్రశ్నించారు. మీ కోసం మీ నాయకుణ్ని మీరు ఓటు అనే ఆయుధంతో ఎన్నుకొవాలని ప్రజలకు సూచించారు. ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, ఎవడి అబ్బసొమ్మని అప్పులు చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బాలకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Nandamuri Balakrishna: తెలంగాణలో సమూల మార్పులకు కారణం ఎన్టీఆర్.. రాజకీయాలంటే ఎన్టీఆర్‌కు ముందు.. ఎన్టీఆర్ తర్వాత: నందమూరి బాలకృష్ణ

Nara Lokesh, Balakrishna

Nara Lokesh, Balakrishna (Pic: Twitter)

రాష్ట్రం నాలుగేళ్లలో అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయిందని అన్నారు. రాష్ట్రంలో అబివృద్దిలేదు, పరిశ్రమలు లేవన్నారు. ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇచ్చే పరిస్థితి లేదని బాలక్రిష్ణ అన్నారు. కానీ, గంజాయిలో దేశంలోనే రాష్ట్రంను నెంబర్ వన్ స్థానంలో నిలిపారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఐదు కోట్ల మంది కలలు కన్న రాజధాని ఎమైందో తెలియడంలేదని, రాజధాని అమరావతి కోసం రైతుల ఉద్యమాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నారని బాలకృష్ణ  ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అన్నారు.. ఏమైంది? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు కూడా సేకరించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. మరోపక్క బాదుడే బాదుడు కార్యాక్రమానికి బాధితులు కానివారు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అంటూ జగన్ ప్రభుత్వం తీరును ఎద్దేవా చేశారు.

TDP Lokesh Padayatra : ఏపీలో మద్య పాన నిషేధం జరిగిందా? నారా లోకేశ్

జగన్‌మోహన్ రెడ్డికి పరిపాలన బాధ్యతలు ఇచ్చారని, కానీ, పరిపాలన చేయడం చేతకాదన్నారు. చుట్టుపక్కల చదువుకున్న వారిని పెట్టుకున్నాడు, వారు చెప్పినవి వినరు అంటూ ఎద్దేవా చేశారు. ఏదో నవరత్నాల పేరుతో రాష్ట ప్రజలను మాయ చేశాడని, గెలిచిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధిపూర్తిగా కుంటుపడిపోయిందని అన్నారు ఈసైకో ప్రభుత్వానికి ఇంతటితో చమరగీతం పాడాలని బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. క్షణికమైన ఆవేశంలో నిర్ణయించి కులాలు, మతాలు పేరుతో మీ ఓటును నాశనం చేసుకోవద్దని ఓటర్లను బాలకృష్ణ కోరారు.

TDP: అసెంబ్లీ ఎన్నికల్లో యువతకే 40 శాతం టికెట్లు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం!

దేశంలోనే హత్యా రాజకీయాలలో ఐదవ స్థానంలో మన రాష్ట్రం ఉందంటే పరిస్థితి ఏలా ఉందో అర్థమౌతుందన్నారు. జగన్ లక్ష్యం ఒక్కటే.. మద్యం, డ్రగ్స్ యువతలోకి పంపి వ్యాపారం చేయడమేనంటూ ఆరోపించారు. వైకాపాలో బరెస్ట్ అవుతుందని, అధికార పార్టీ ఎమ్మెల్యేల్లోనే అసంతృప్తి మొలైందని బాలకృష్ణ అన్నారు. నాకు మించిన సైకాలజిస్ట్ లేరు, నేను అందరి సైకాలజీ చెబుతాను అంటూ బాలయ్య అన్నారు. మీ ఓటే మీకు ఆయుధం, ఆ ఓటుతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని ప్రజలను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కోరారు.