Nandamuri Balakrishna: తెలంగాణలో సమూల మార్పులకు కారణం ఎన్టీఆర్.. రాజకీయాలంటే ఎన్టీఆర్‌కు ముందు.. ఎన్టీఆర్ తర్వాత: నందమూరి బాలకృష్ణ

కార్యకర్తల కష్టమే 41 ఏళ్ల తెలుగు దేశం పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికల‌ విజయంతో టీడీపీ కార్యకర్తలు రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలి. పాత తరానికి గుర్తుండేది ఎన్టీఆర్ పాలన, సినిమాలు మాత్రమే. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు సరికాదు. ప్రాంతాలు వేరైనా.. తెలుగువారంతా ఒక్కటే. తెలుగు గడ్డపై ఆత్మ విశ్వాసాన్ని నింపిన ఘనత ఎన్టీఆర్‌ది.

Nandamuri Balakrishna: తెలంగాణలో సమూల మార్పులకు కారణం ఎన్టీఆర్.. రాజకీయాలంటే ఎన్టీఆర్‌కు ముందు.. ఎన్టీఆర్ తర్వాత: నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: తెలంగాణలో సమూల మార్పులకు కారణం ఎన్టీఆర్ అని అభివర్ణించారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఆయన చేసిన అభివృద్ధినే ప్రస్తుత ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయన్నారు. హైదరాబాద్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బుధవారం జరిగిన టీడీపీ ఆవిర్భావ సభలో ఆయన పాల్గొన్నారు.

Rohit Sharma: అర్జున్ టెండూల్కర్‌‌కు ఈ సారైనా ముంబై జట్టులో చోటు దక్కేనా? రోహిత్ శర్మ సమాధానం ఇదే

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ‘‘కార్యకర్తల కష్టమే 41 ఏళ్ల తెలుగు దేశం పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికల‌ విజయంతో టీడీపీ కార్యకర్తలు రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలి. పాత తరానికి గుర్తుండేది ఎన్టీఆర్ పాలన, సినిమాలు మాత్రమే. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు సరికాదు. ప్రాంతాలు వేరైనా.. తెలుగువారంతా ఒక్కటే. తెలుగు గడ్డపై ఆత్మ విశ్వాసాన్ని నింపిన ఘనత ఎన్టీఆర్‌ది. రాజకీయాలంటే ఎన్టీఆర్‌కు ముందు.. ఎన్టీఆర్ తర్వాత అనే చరిత్ర ఆయనది. రాజకీయాల్లో ఎన్టీఆర్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు.

Cheetah: నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా.. తల్లీ, పిల్లలు క్షేమం.. వైరల్ వీడియో

పేదల ఆకలి తీర్చిన అన్న.. భరోసా ఇచ్చిన అమ్మ. మహిళలకు ధైర్యానిచ్చిన అన్న ఎన్టీఆర్‌. ఆయనకు మరణం లేదు.. నిత్యం వెలిగే దీపం ఎన్టీఆర్. చంద్రబాబు, ఎన్టీఆర్ చేసిన అభివృద్ధినే ప్రస్తుత ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. తెలంగాణలో సమూల మార్పులకు కారణం ఎన్టీఆర్. పేదలకు కాంక్రీట్ శ్లాబ్ ఇళ్ళ నిర్మాణం ఎన్టీఆర్ హాయాంలోనే జరిగింది’’ బాలకృష్ణ వ్యాఖ్యానించారు.