TDP: అసెంబ్లీ ఎన్నికల్లో యువతకే 40 శాతం టికెట్లు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం!

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

TDP: అసెంబ్లీ ఎన్నికల్లో యువతకే 40 శాతం టికెట్లు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం!

TDP

TDP: ఆంధ్రప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం యువతకే టికెట్లు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రజల్లో తిరుగుతూ కష్టపడిన వారికే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ఇవాళ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణేన్ని విడుదల చేస్తోన్న కేంద్రం, ప్రధానమంత్రికి అభినందనలు తెలుపుతూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రేపటి నుంచి మే 28 వరకు వివిధ ప్రదేశాల్లో వంద సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 42 పార్లమెంటు నియోజక వర్గాల్లో శతజయంతి ఉత్సవాలు జరపాలని నిర్ణయించామని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై వైసీపీ పిచ్చి ప్రేలాపనలు ఆపాలని చెప్పారు.

సైకిల్ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో జగన్ చెప్పాలని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా.. యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోందని చెప్పారు. ఏపీకి చెందిన 13, తెలంగాణకు చెందిన 4 కలిపి పొలిట్ బ్యూరోలో మెత్తం 17 అంశాలపై చర్చించామని తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ముఖ్యమంత్రి జగన్ కనీసం‌ సమీక్ష జరగకపోవటం దుర్మార్గమని అన్నారు. తన తప్పును ఒప్పుకొని సీఎం జగన్ జీవో నంబర్ 1ని వెనక్కి తీసుకోవాలని చెప్పారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. నాలుగేళ్ళుగా పది లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన హీనచరిత్ర జగన్ దని అన్నారు. కొత్తవి దేవుడెరుగు.. జగన్ ధన దాహానికి పాత పరిశ్రమలు తరలిపోతున్నాయని చెప్పారు. జీతాల‌ కోసం ప్రభుత్వ ఉద్యోగులు దర్నాలు చేయాల్సిన పరిస్థితి బాధాకరమని తెలిపారు. ఐదు వేల రూపాయలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించామని చెప్పారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుతామని తెలిపారు.

MLA Durgam Chinnaiah : కోరిక తీర్చాలని, అమ్మాయిలను పంపాలని వేధించారు- బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై మహిళ తీవ్ర ఆరోపణలు