Gunasekhar: ఆ విషయంలో హీరోలు బన్నీని ఫాలో కావాలి – గుణశేఖర్
స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘శాకుంతలం’ అనే మైథలాజికల్ మూవీతో మనముందుకు వస్తున్నాడు డైరెక్టర్ గుణశేఖర్.

Gunasekhar Says Telugu Heroes Must Follow Allu Arjun
Gunasekhar: టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న డైరెక్టర్ గుణశేఖర్. ఆయన తెరకెక్కించే సినిమాలు వేరే సినిమాలకు పూర్తి వైవిధ్యంగా ఉంటాయని అభిమానులు అంటారు. కమర్షియల్ సినిమాలను కూడా తనదైన పద్ధతిలో వైవిధ్యాన్ని జోడించి వాటిని స్పెషల్ చిత్రాలుగా ప్రెజెంట్ చేసి సక్సెస్ అందుకున్నాడు గుణశేఖర్. ఇక ప్రస్తుతం ‘శాకుంతలం’ అనే మైథలాజికల్ మూవీతో మనముందుకు వస్తున్నాడు ఈ దర్శకుడు.
Guna Sekhar : సమంతని ‘శాకుంతల’గా తీసుకోవడానికి ఆ సినిమాని చాలా సార్లు చూశాను
స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో గుణశేఖర్ సందడి చేస్తున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని గుణశేఖర్ తెలిపారు. ఇక టాలీవుడ్‌లో హీరోలందరూ బన్నీని ఫాలో అవ్వాల్సిందిగా కామెంట్ చేశాడు ఈ డైరెక్టర్. తాను తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ మూవీలో గోన గన్నారెడ్డి పాత్రలో బన్నీ కేమియో రోల్ చేసి ఆ పాత్రను పవర్‌ఫుల్‌గా మలిచాడని.. తాను అడగ్గానే ఈ రోల్ చేసేందుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని గుణశేఖర్ తెలిపాడు.
Gunasekhar: దర్శకుడు గుణశేఖర్ కూతురి నిశ్చితార్థం..
మిగతా హీరోలు కూడా కేమియో రోల్స్ చేస్తే ఇతర సినిమాలకు బూస్ట్ ఇచ్చిన వారవుతారని గుణశేఖర్ చెప్పుకొచ్చాడు. బన్నీ చేసిన పాత్రను ఇంకా ప్రశంసిస్తున్న గుణశేఖర్ శాకుంతలం సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.