Guna Sekhar : సమంతని ‘శాకుంతల’గా తీసుకోవడానికి ఆ సినిమాని చాలా సార్లు చూశాను

ప్రస్తుతం శాకుంతలం సినిమా యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో సమంతని ఇందులో హీరోయిన్ గా ఎందుకు తీసుకున్నారో చెప్పాడు. గుణ శేఖర్ మాట్లాడుతూ................

Guna Sekhar : సమంతని ‘శాకుంతల’గా తీసుకోవడానికి ఆ సినిమాని చాలా సార్లు చూశాను

Guna Sekhar tells about why he took samantha as main lead for shakunthalam

Guna Sekhar :  మయోసైటిస్ తగ్గిన తర్వాత సమంత ఇటీవలే మళ్ళీ బిజీ అయింది. వరుస సినిమాలు షూటింగ్స్ చేస్తూ మరో పక్క రాబోయే సినిమాలకు ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. త్వరలో సమంత శాకుంతలం సినిమాతో రాబోతుంది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడ్డ ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నారు. మన పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథ ఆధారంగా, మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం అనే కావ్యం నుంచి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు గుణశేఖర్. ఈ సినిమాకి గుణశేఖర్ కూతురు నీలిమ గుణ, దిల్ రాజులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం శాకుంతలం సినిమా యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో సమంతని ఇందులో హీరోయిన్ గా ఎందుకు తీసుకున్నారో చెప్పాడు. గుణ శేఖర్ మాట్లాడుతూ.. వ్యాస మహర్షి రాసిన దుశ్యంతుడు – శకుంతల కథ, కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం రెండిటిని ఆధారంగా తీసుకొని ఈ సినిమాని రాసుకున్నాను. కథ చిన్నదే అయిన విజువల్ గా బాగా చూపించొచ్చు. ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా సమంతని తీసుకొమ్మని మా అమ్మాయి నీలిమ సలహా ఇచ్చింది. మా అమ్మాయి చెప్పాక సమంత రంగస్థలం సినిమాని చాలా సార్లు చూశాను. అందులో సమంత నటనని అన్ని రకాలుగా అబ్జర్వ్ చేసాను. రంగస్థలంలో సమంత పాత్రని పలుమార్లు చూసి శకుంతలగా ఎలా ఉంటుందో అని ఊహించుకున్నాను. ఆమెని ఓకే అనుకున్నాక సినిమాలో నేను అనుకున్న దానికంటే సమంత బాగా చేసింది. నేను సమంత మెయిన్ లీడ్ మీదే ఈ కథ నడిపించాను అని తెలిపారు.

NTR 30 : భారీగా NTR30 ఓపెనింగ్.. రాజమౌళి, ప్రశాంత్ నీల్.. అనేక మంది సినీ ప్రముఖుల సమక్షంలో..

సమంత కొంచెం గ్యాప్ తీసుకొని గత సంవత్సరం యశోద సినిమాతో వచ్చి హిట్ కొట్టింది. ఇప్పుడు ఏప్రిల్ 14న శాకుంతలం సినిమాతో పాన్ ఇండియా వైడ్ వచ్చి హిట్ కొట్టాలని చూస్తుంది. సమంత అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.