Balakrishna Grand Entry in Unstoppable Season 2 First Episode
Unstoppable 2 : బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్ షో భారీగా హిట్ అయింది. పలు రికార్డులని కూడా క్రియేట్ చేసింది. ఈ షోలో బాలయ్య బాబు సరికొత్తగా కనపడటంతో అభిమానులు ఫుల్ ఫిదా అయిపోయారు. ఈ షోకి సీజన్ 2ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, తాజాగా నేడు ఆహాలో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఎపిసోడ్ రిలీజైన కొద్దిసేపటికే ఇది వైరల్ గా మారింది.
సీజన్ 2 లో బాలయ్య బాబు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై బాణాసంచా వెలుగుల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఒకసారి బరిలోకి దిగితే బ్రేకుల్లేని బుల్డోజర్ ని తొక్కి పారదొబ్బుతా అనే డైలాగ్ చెప్పి అఖండ సినిమాలోని బాలయ్య సాంగ్ కి స్టెప్పులేశారు. ఆ తర్వాత ఇటీవల ఈ షో కోసం డిజైన్ చేసిన బాలయ్య ర్యాప్ సాంగ్ కి కూడా స్టెప్పులేశారు బాలకృష్ణ. ఆ తర్వాత నందమూరి ఫ్యామిలీ, ఎన్టీఆర్, షో గురించి గ్రాండ్ గా డైలాగ్స్ చెప్పారు. చివర్లో ఎప్పటిలాగే నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు అని అందరికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
Unstoppable 2: ‘అన్‌స్టాపబుల్ 2’ స్ట్రీమింగ్‌కు టైమ్ ఫిక్స్..!
ఈ సారి గతంలో కంటే మరింతమంది ఆడియన్స్ ని తీసుకొచ్చారు. ఇక మొదటి ఎపిసోడ్ గురించి బాలకృష్ణ మాట్లాడుతూ.. సీజన్ 1 అయ్యాక సీజన్ 2 ప్రకటించాక ఎవరెవరో ఏదేదో రాశారు, ఎవరెవరో వస్తారు అని చెప్పారు. నా బంధువుని తీసుకొద్దామనుకున్నా కానీ ప్రజలందరికి బంధువుని తీసుకొద్దామని ఫిక్స్ అయ్యాను అని చెప్పి చంద్రబాబు నాయుడుకి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. బావ బామ్మర్దుల ఎంట్రీతో మొదటి ఎపిసోడ్ గ్రాండ్ గా మొదలైంది.