Balakrishna : ఆహా వేదిక పై మరోసారి బాలయ్య హోస్టింగ్.. కానీ అన్‌స్టాపబుల్‌కి కాదు!
తెలుగు ఓటిటి ప్లాట్ఫార్మ్ ఆహా నెంబర్ వన్ ఓటిటి స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ గా దూసుకు పోతుంది. బాలయ్య అన్‌స్టాపబుల్ షోతో టాక్ షోలకి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ప్రస్తుతం అభిమానులు సీజన్ 3 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతలో ఆహా బాలయ్యతో మరో సర్ప్రైజ్ ప్లాన్ చేశారు.
- gum 95921
- Published on- March 12, 2023 / 03:01 PM IST
balakrishna hosting telugu indian idol season 2
Balakrishna : తెలుగు ఓటిటి ప్లాట్ఫార్మ్ ఆహా నెంబర్ వన్ ఓటిటి స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ గా దూసుకు పోతుంది. అదిరిపోయే కంటెంట్ తో తెలుగు ఆడియన్స్ కి 100 పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వస్తుంది. ఇటీవల కాలంలో ఒరిజినల్ మూవీ అండ్ సిరీస్ తో కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. ఇక టాక్ షోల గురించి అయితే చెప్పనవసరం లేదు. బాలయ్య అన్‌స్టాపబుల్ షోతో టాక్ షోలకి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ తో సీజన్ 2 ని పవర్ ప్యాకెడ్ గా ముగించారు.
Oscar 2023 : ఇండియన్ హిస్టరీలో ఆస్కార్‌కి నామినేట్ అయిన సినిమాలు ఇవే..
ప్రస్తుతం అభిమానులు సీజన్ 3 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతలో ఆహా బాలయ్యతో మరో సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆహాలో ప్రసారమవుతున్న మ్యూజిక్ కాంపిటీషన్ షో ‘ఇండియన్ ఐడల్’ సెకండ్ సీజన్ త్వరలో మొదలు కాబోతుంది. దీంతో ఇటీవల సెకండ్ సీజన్ కంటెస్టెంట్స్ కోసం ఆడిషన్స్ జరిగాయి. ఈ ఆడిషన్ కి వేలకు కంటెస్టెంట్స్ పైగా హాజరయ్యారు. వారిలో నుంచి 12 మందిని ఎస్ ఎస్ థమన్, కార్తీక్, గీతామాధురి ఎంపిక చేశారు.
Oscar 2023 : ఆస్కార్ అమ్ముకోవచ్చు తెలుసా.. అమ్మితే వచ్చే రేటు తెలిస్తే షాక్ అవుతారు!
ఈ 12 మంది ఫైనల్ కంటెస్టెంట్స్ ని పరిచయం చేస్తూ సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ ల్లో బాలకృష్ణ హోస్ట్ గా కనిపించబోతున్నాడు. మార్చి 17, 18 తేదీల్లో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇక రిలీజ్ చేసిన ప్రోమోలో బాలయ్య అల్లరి మాములుగా లేదు. ఇండియన్ ఐడల్ మొదటి సీజన్ మంచి విజయాన్ని సాధించింది. ఇక సెకండ్ సీజన్ ని బాలయ్యతో స్టార్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడానికి ఆహా ప్లాన్ చేసింది. టాక్ షో అయినా, మ్యూజిక్ షో అయినా బాలయ్య దిగనంత వరుకే, ఒక్కసారి బాలయ్య దిగాడా హిస్టరీ రిపీట్ అవ్వాల్సిందే.
