Balakrishna: సినీ పరిశ్రమ రాజధానిగా ఆంధ్రప్రదేశ్.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్, నాటక అభివృద్ధి సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార వేడుకలో బాలకృష్ణ(Balakrishna) కీలక వ్యాఖ్యలు చేశారు.

Balakrishna interesting comments on development of telugu film industry in Andhra Pradesh

  • ఏపీ నుంచే 70 శాతం కలెక్షన్లు.
  • పరిశ్రమను బ్రతికించాల్సిన పరిస్థితి వచ్చింది.
  • త్వరలోనే సింగిల్ విండో విధానం.

Balakrishna: ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్, నాటక అభివృద్ధి సంస్థ (APFDC) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార వేడుకలో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు సినిమాలకు వచ్చే మొత్తం కలెక్షన్లలో దాదాపు 70 శాతం ఆదాయం ఒక్క ఏపీ నుంచే వస్తోందని, కాబట్టి ఇక్కడ పరిశ్రమను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని బాలయ్య గుర్తు చేశారు.

Rakul preet singh: చీరలో గ్లామర్ రచ్చ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. స్టన్నింగ్ ఫొటోస్ వైరల్

ఏపీలో సినిమా షూటింగ్‌లకు అద్భుతమైన సహజ సిద్ధమైన లొకేషన్లు ఉన్నాయని, ‘అఖండ’ వంటి చిత్రాల చిత్రీకరణను రంపచోడవరంలోనే జరిపామని బాలకృష్ణ(Balakrishna) పేర్కొన్నారు. తనకంటే ఎక్కువగా ఏపీలో ఎవరూ షూటింగ్‌లు చేసి ఉండరని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్‌లతో కలిసి తామంతా కృషి చేస్తున్నామని చెప్పారు. షూటింగ్‌ల అనుమతుల కోసం త్వరలోనే ఒకే చోట అన్ని లభించేలా ‘సింగిల్ విండో’ విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభంపై బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. షూటింగ్‌లు తగ్గడం వల్ల ఎంతోమంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, పంపిణీదారులు థియేటర్లకు తాళాలు వేసుకునే పరిస్థితులు వచ్చాయని ఆవేదన చెందారు. సాంకేతికత పెరిగినప్పటికీ సినిమా నిర్మాణం ఆలస్యం కావడంపై స్పందిస్తూ.. ఇప్పుడు సినిమాను ఎలా తీయాలో ఆలోచించడం కంటే, పరిశ్రమను ఎలా బ్రతికించాలో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏపీలో ఇండస్ట్రీని కాపాడుకోవడానికి జోడెడ్ల ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరుతున్నామని బాలయ్య పిలుపునిచ్చారు.