Bhagavanth Kesari : భగవంత్ కేసరి ట్రైలర్ బ్లాస్ట్‌కి టైం ఫిక్స్ చేసిన బాలయ్య.. ఈసారి మీ అంచనాలకు మించి..

భగవంత్ కేసరి ట్రైలర్ బ్లాస్ట్‌కి బాలయ్య టైం ఫిక్స్ చేశాడు. ఈసారి అందరి అంచనాలకు మించి బాలయ్య..

Balakrishna Kajal Aggarwal Sreeleela Bhagavanth Kesari trailer update

Bhagavanth Kesari : నంద‌మూరి బాల‌కృష్ణ, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ్రీలీల ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘భగవంత్ కేసరి’. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. అలాగే ప్రమోషన్స్ ని కూడా వరుసగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే మూవీలోని సాంగ్స్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడానికి టైం ఫిక్స్ చేశారు.

ఈ నెల 8న భగవంత్ కేసరి ట్రైలర్ బ్లాస్ట్‌ జరగబోతుంది అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈసారి అందరి అంచనాలకు మించి బాలయ్యని ఒక సరికొంత యాంగిల్ లో చూడబోతున్నారు అంటూ మేకర్స్ తెలియజేస్తున్నారు. కాగా ఈ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. వరంగల్ లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించనున్నారట. అయితే నిర్మాతలు మాత్రం ఈ విషయాన్ని తెలియజేయలేదు.

Also read : NTR31 : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్ ఇచ్చిన నిర్మాతలు.. 2024 ఏప్రిల్..!

ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ కాబోతుంది. స్క్రీన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీ థమన్ సంగీతం అందిస్తున్నారు. తండ్రి కూతురు అనుబంధంతో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుందని తెలుస్తుంది. జైలర్ అండ్ విక్రమ్ తరహాలోనే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందట. అలాగే అనిల్ రావిపూడి మార్క్ కామెడీ కూడా మూవీలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయనుంది.