Unstoppable with NBK : బాలయ్య – రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో వచ్చేసింది..

తాజాగా బాలకృష్ణ - చరణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో రిలీజ్ చేసారు.

Balakrishna Ram Charan Aha Unstoppable with NBK Episode Second Part Promo Released

Unstoppable with NBK : బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల రామ్ చరణ్ ఈ షోకి వచ్చి సందడి చేసాడు. ఆ ఎపిసోడ్ ని రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తుండటంతో మొదటి పార్ట్ గత వారం వచ్చి మంచి హిట్ అయింది. ఇప్పుడు రెండో పార్ట్ ఈ వారం రిలీజ్ కానుంది.

Also Read : Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ రివ్యూ.. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్.. ఫ్యాన్స్ కు యాక్షన్ ఫీస్ట్..

తాజాగా బాలకృష్ణ – చరణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమో ఆద్యంతం సరదాగా సాగింది. ఫస్ట్ పార్ట్ కి కంటిన్యూగా ఉండబోతుంది ఈ ఎపిసోడ్. ప్రోమోలో అకిరా నందన్ గురించి మాట్లాడాడు చరణ్. అలాగే ఉపాసనతో లవ్ స్టోరీ గురించి చెప్పాడు. చరణ్ అక్క సుష్మిత, చెల్లి శ్రీజ మాట్లాడిన వీడియోని ప్లే చేసారు బాలయ్య. అలాగే ప్రభాస్ కి కాల్ చేసి అతని పెళ్లి గురించి మాట్లాడారు. చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ హీరో శర్వానంద్, నిర్మాత విక్రమ్ వచ్చి బోలెడన్ని సంగతులు పంచుకున్నారని తెలుస్తుంది. ప్రోమోలో చరణ్ పవన్ కళ్యాణ్ మ్యానరిజంని అనుకరించింది కూడా చూపించారు. మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి…

ప్రస్తుతం ఈ అన్‌స్టాపబుల్ ప్రోమో వైరల్ గా మారింది. మెగా ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య – చరణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 జనవరి 17 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నారు అధికారికంగా ప్రకటించారు.

Also Read : Daaku Maharaaj Collections : డాకు మహారాజ్ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా? బాలయ్య కెరీర్ హైయెస్ట్..

ఇక చరణ్ ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించాడు. ఇందులో డ్యూయల్ రోల్ లో చరణ్ అదరగొట్టాడు. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా భారీగా తెరకెక్కింది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా థియేటర్స్ లో నడుస్తుంది. మొదటి రోజు ఈ సినిమా 186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు.