Balakrishna
Balakrishna : బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇది అయ్యాక గోపీచంద్ మలినేనితో ఒక సినిమా ఓకే అయిందని సమాచారం. తాజాగా బాలయ్య మరో సినిమాకు ఓకే చెప్పినట్టు, అది కూడా డైరెక్టర్ క్రిష్ తో అని తెలుస్తుంది.
డైరెక్టర్ క్రిష్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా నుంచి మధ్యలోనే తప్పుకున్న సంగతి తెలిసిందే. పలు వ్యక్తిగత, ప్రొఫెషనల్ కారణాలతో క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని పవన్ కూడా ప్రమోషన్స్ లో చెప్పారు. క్రిష్ ప్రస్తుతం అనుష్కతో ఘాటీ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఘాటీ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత క్రిష్ బాలకృష్ణతో మరో సినిమా చేస్తాడని టాక్ వినిపిస్తుంది.
Also Read : Nushrratt Bharuccha : హీరో లేకపోయినా ఆయన కారవాన్ అడిగితే ఇవ్వలేదు.. అమ్మాయి హిట్ ఇచ్చినా ఛాన్సులు రావు..
ఇప్పటికే క్రిష్ బాలయ్యతో గౌతమి పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు చేసారు. ఇప్పుడు మరో సినిమాకు బాలయ్య క్రిష్ ని ఎంచుకున్నారని తెలుస్తుంది. అయితే అది ఆదిత్య 369 సీక్వెల్ కావొచ్చు అని టాక్ వినిపిస్తుంది. బాలయ్య కెరీర్లో పెద్ద హిట్ అయిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ తీస్తానని గతంలో అనేకమార్లు చెప్పారు బాలయ్య. ఆ సినిమాకు సీక్వెల్ టైటిల్ ఆదిత్య 999 అని, అందులో బాలయ్య తనయుడు కూడా నటిస్తాడని చెప్పారు. ఆ సినిమానే క్రిష్ డైరెక్ట్ చేస్తాడని వినిపిస్తుంది. మరి అధికారిక ప్రకటన వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే.