బాలయ్య ఫిక్స్.. BB3 హిట్ అయిపోయినట్లే

  • Publish Date - June 13, 2020 / 10:30 AM IST

బాలకృష్ణ-బోయపాటి హ్యాట్రిక్ మూవీ అనౌన్స్ చేసిన దగ్గరనుంచే ఎక్స్ పెక్టేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ రెండు సినిమాల్లాగా హిట్ అవుతుందా..? లేక బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య సేమ్ ఫ్లాప్ ను ఎదుర్కోవాల్సి వస్తుందా..? అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడిపోతుంటే బాలకృష్ణ మాత్రం బిందాస్ గా ఉండమని చెబుతున్నారు అభిమానులకు. అంత ధీమాగా ఉండటానికి కారణమేమై ఉంటుంది..?

బాలకృష్ణ హిట్ కోసం ఆరాపడుతున్నారు . రెండేళ్ల సరైన హిట్ లేకపోవడంతో ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాల్సిందే అని  డిసైడ్ అయ్యారు. అందుకే బోయపాటితో సినిమా సంవత్సరం క్రితం స్టార్ట్ అవ్వాల్సి ఉన్నా.. ఈ సారి హిట్ సినిమా చెయ్యాల్సిందే అని అంతకుముందు రాసిన స్టోరీ మార్చమని మళ్లీ టైమ్ ఇచ్చారు బోయపాటికి. టైమ్ తీసుకుని మాంచి స్టోరీతో వచ్చిన బోయపాటి.. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ చూసిన ఆడియన్స్ కి రకరకాల డౌట్స్ వస్తున్నాయి.

బోయపాటితో బాలకృష్ణ చేస్తున్న సినిమాలో కూడా ఇలాగే ఫుల్ యాక్షన్ తో రాబోతున్నారు.  ఇంతకుముందు చేసిన సింహ, లెజెండ్ సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా కూడా హిట్ అవ్వుతుందా..? లేక బాలయ్య ఫ్లాప్స్ లోఉన్నారు కాబట్టి..అదే ఫ్లోని ఫాలో అయిపోతారా అని తెగ వర్రీ అయిపోతున్నారు ప్యాన్స్. అందుకే ..బాలయ్య ఈ సారి సినిమా హిట్ అవ్వాల్సిందే… అయ్యి తీరుతుందంటూ అభిమానులకు భరోసా ఇస్తున్నారు .

 ఈ సినిమాలో బాలయ్య స్లిమ్ అయ్యి చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. వేరియేషన్స్ కోసం వర్కవుట్ చేసి వెయిట్ కూడా తగ్గిపోయారు బాలకృష్ణ. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కూడా సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఫుల్‌గా పెంచేసుకుంది. అందుకే టీజర్‌కే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఇంతకుమించి ఉంటుంది అంటూ  ఫుల్ కాన్పిడెంట్ గా ఉన్నారు బాలకృష్ణ.

ఆయన సినిమాలంటేనే సహజంగా డైలాగ్స్.. యాక్షన్ సీక్వెన్స్ లను ఊహించుకుంటారు ఫ్యాన్స్. దానికి తగ్గట్టు బాలకృష్ణకు సవాల్ విసిరే పవర్ ఫుల్ విలన్ ఉంటే అభిమానులకు పండగే. అంతకు ముందు బోయపాటి తీసిన రెండు సినిమాల్లోను భయంకరమైన విలనిజాన్ని చూపించారు. ఈ సారి కూడా అదే రేంజ్ లో యాక్షన్ ని, డ్రామాని చూపిస్తున్నామని, అందుకే సినిమా సక్సెస్ మీద అంత కాన్పిడెంట్ గా ఉన్నామని బాలయ్యే స్వయంగా చెప్పారు .