Balakrishna : బప్పి లహరి మరణంపై బాలకృష్ణ సంతాపం

తాజాగా బప్పి లహరి మరణంపై నందమూరి బాలకృష్ణ సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో బాలకృష్ణ.. ''సంగీత దర్శకుడు, గాయకుడు బప్పిలహరి మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. నేను....

Bappi Lahiri :  బాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు బప్పీ లహరి మంగళవారం రాత్రి కన్నుమూశారు. బాలీవుడ్ లోనే కాక తెలుగులో కూడా చాలా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలకి మంచి మంచి ఆల్బమ్స్ ఇచ్చారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బప్పి లహిరి మంగళవారం రాత్రి మరణించారు. బప్పి లహరి మృతిపై బాలీవుడ్, టాలీవుడ్ తో సహా దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Chiranjeevi : బప్పి లహరి మరణంపై మెగాస్టార్ ట్వీట్

తాజాగా బప్పి లహరి మరణంపై నందమూరి బాలకృష్ణ సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో బాలకృష్ణ.. ”సంగీత దర్శకుడు, గాయకుడు బప్పిలహరి మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. నేను నటించిన ‘రౌడి ఇన్స్ పెక్టర్’, ‘నిప్పురవ్వ’ వంటి చిత్రాలకు బప్పి లహరి సంగీతం అందించారు. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ తన సంతాపాన్ని తెలియచేశారు.

ట్రెండింగ్ వార్తలు