Unstoppable Promo Making : బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో మేకింగ్ వీడియో చూశారా? అదిరిందిగా..

తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో మేకింగ్ వీడియోని ఆహా టీమ్ విడుదల చేసింది.

Balakrishna Unstoppable Season 4 Promo Making Video Released by Aha

Unstoppable Promo Making Video : బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ విత్ NBK షో మూడు సీజన్లు సూపర్ హిట్ అవ్వగా త్వరలో నాలుగో సీజన్ రాబోతుంది. ఇటీవలే అన్‌స్టాపబుల్ నాలుగో సీజన్ అనౌన్స్ చేసి సరికొత్త ప్రోమోని కూడా రిలీజ్ చేసారు. ఇందులో బాలయ్య బాబుని యానిమేటెడ్ సూపర్ హీరోగా చూపించారు. దీంతో ఈ ప్రోమో బాగా వైరల్ అయింది.

Also Read : Unstoppable with NBK : మరోసారి బాలయ్య అన్‌స్టాపబుల్‌కి సీఎం చంద్రబాబు.. ఈసారి ఏ రేంజ్‌లో ఉండబోతుందో..

తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో మేకింగ్ వీడియోని ఆహా టీమ్ విడుదల చేసింది. అందులో బాలయ్యతో ఎలా షూట్ చేసారు, యానిమేషన్ లో బాలయ్యని ఎలా డిజైన్ చేసారు, బాలయ్యని ఎలా సూపర్ హీరోగా మార్చారు అని ఆసక్తిగా చూపించారు. దీంతో ఈ అన్‌స్టాపబుల్ ప్రోమో మేకింగ్ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా ఈ వీడియో చూసేయండి..

ఇక ఇప్పటికే అన్‌స్టాపబుల్ సీజన్ 4 కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసారని సమాచారం. అలాగే ఈ సీజన్ లో మొదటి ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబుతో ఉండబోతుంది. దానికి సంబంధించిన షూట్ ఇవాళ జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయిడు అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేసారు. ఇప్పుడు మరోసారి రాబోతుండటంతో అభిమానులతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా ఈ షో కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 24 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.