Balakrishna wants krithi sanon as heroine in his next movie
Balakrishna : బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. అన్‌స్టాపబుల్ రెండో సీజన్ లో ఇప్పటికే అయిదు ఎపిసోడ్ లు పూర్తికాగా తాజాగా ఆరో ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఆరో ఎపిసోడ్ కి ముగ్గురు భామలని తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు ఇప్పటి హీరోయిన్ రాశిఖన్నాని తీసుకొచ్చారు. ఈ ముగ్గురితో కలిసి బాలయ్య ఎపిసోడ్ లో సందడి చేశారు.
ఈ ఎపిసోడ్ లో జయసుధ, జయప్రదలతో అప్పటి సినిమాలు, నటుల గురించి మాట్లాడారు. అలాగే బాలయ్య వారిని ప్రశ్నలు అడగగా జయసుధ, జయప్రద కూడా బాలయ్యని పలు ప్రశ్నలు అడిగారు. నయనతార, శృతిహాసన్ ఇద్దరిలో ఎవరితో కలిసి పనిచేయడం ఇష్టం అని అడగగా బాలయ్య ప్రస్తుతం సంక్రాంతికి శృతిహాసన్ తో రాబోతున్నాను. నేను, శృతిహాసన్ ఇప్పుడు హిట్ పెయిర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.
Jayaprada : ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని ఇప్పటికి కూడా పోరాడుతున్నాను..
అలాగే మీ నెక్స్ట్ సినిమాలో కృతి సనన్, అలియా భట్, దీపికా పదుకొనే లలో ఎవర్ని హీరోయిన్ గా పెట్టుకుంటారు అని అడగగా అలియాభట్ కి పెళ్లి అయిపోయి పాప కూడా పుట్టింది, దీపికాకి పెళ్లి అయిపొయింది. కృతి సనన్ ఖాళీగా ఉంది కాబట్టి కృతి సనన్ ని నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటాను అని అన్నారు బాలయ్య. ఇక రష్మిక, శృతి హాసన్ లో ఎవరంటే ఇష్టం అని అడగడంతో ఒకరు క్రష్, ఇంకొకరితో ప్రస్తుతం సినిమా చేస్తున్నాను అని అన్నారు. ఇలా సరదాగా ఎపిసోడ్ సాగింది.