Sirivennela Seetharama Sastry: తెలుగు జాతికి వన్నెతెచ్చిన మహానుభావుడు – నందమూరి బాలకృష్ణ

సిరివెన్నెల సీతారామశాస్త్రి.. కలంతో అక్షరాలను క్రమంగా పెట్టి ప్రాసతో పదాలతో పదనిసలు వేయించిన సాహిత్య సేవకుడు.

Sirivennela Seetharama Sastry: SSS.. సిరివెన్నెల సీతారామశాస్త్రి.. కలంతో అక్షరాలను క్రమంగా పెట్టి ప్రాసతో పదాలతో పదనిసలు వేయించిన సాహిత్య సేవకుడు.. ఆయన మృతితో సినీ పరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఫిల్మ్ ఛాంబర్‌లో సిరివెన్నెల పార్థీవదేహం ఉండగా.. ప్రముఖులు అందరూ విచ్చేసి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ కూడా నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు. ఈరోజు చాలా దుర్దినమని, ఇది నమ్మలేని నిజంగా అనిపిస్తుందని అన్నారు. ఏం మాట్లాడాలో తెలియడం లేదంటూ కంటతడి పెట్టుకున్నారు బాలకృష్ణ. తెలుగు భాషకు, సాహిత్యానికి సిరివెన్నెల భూషణం అని, తాను పుట్టిన జాతికి వన్నె తెచ్చిన వ్యక్తి సిరివెన్నెలయని కొనియాడారు.

సిరివెన్నెల అనే సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న మహానుబావుడు సీతారామశాస్త్రియని, విప్లవాత్మక కవియని అన్నారు. ఎప్పుడు కలిసినా ఎంతో చలాకీగా మాట్లాడేవారన్నారు. సాహిత్య అభిలాషులు అందరికీ, సిరివెన్నెల స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. సిరివెన్నెల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అభిప్రాయపడ్డారు. ఇంకా ఎంతో సేవలందించాల్సిన ఆయన లేకపోవడం బాధాకరమని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు