Bala Krishna: బిగ్‌బాస్ నటరాజ్‌కు బాలయ్య బంపర్ ఆఫర్
నందమూరి నటసింహం బాలయ్య త్వరలో ఆహా ఓటీటీలో ‘Unstoppable’ అనే టాక్ షో చేయనున్నారు.

Balayya
Balayya: నందమూరి నటసింహం బాలయ్య త్వరలో ఆహా ఓటీటీలో ‘Unstoppable’ అనే టాక్ షో చేయనున్నారు. ఈ షోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు బాలయ్య ఎప్పుడూ కూడా ఇటువంటి షో చెయ్యకపోవడంతో అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఈగర్‌గా ఎదరుచూస్తున్నారు. రీసెంట్‌గా ఈ షో హైదరాబాద్‌లో లాంచ్ అయ్యింది.
అయితే, లేటెస్ట్‌గా ఈ షో కోసం బాలయ్య ఓ ఇంట్రడక్షన్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. దీనికి కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలయ్యతో నటరాజ్ మాస్టర్ తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కొరియోగ్రాఫర్‌గా సినిమాలు చేసిన నటరాజ్ మాస్టర్ ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొని నాలుగు వారాల పాటు హౌస్‌లో ఉన్నారు. ఎలిమినేట్ అయిన తర్వాత మళ్లీ నటరాజ్‌కి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య నుంచి బంపరాఫర్ అందుకున్నారు నటరాజ్.
బాలయ్య షోలో ఎప్పుడూ చూడని కాంబినేషన్ కనిపించే అవకాశం ఉందని అంటున్నారు నిర్వాహకులు. మెగా ఫ్యామిలీ నుంచి కూడా పలువు గెస్ట్‌లుగా ఉండే అవకాశం ఉంది. వీరిని బాలయ్య తన ప్రశ్నలతో ఎలా ఇంటర్వ్యూ చేస్తారనేది ఆసక్తికరమే.