అజిత్ పాటకు బాలయ్య ఆట.. ఫ్యాన్స్ ఫిదా!
నటసింహ నందమూరి బాలకృష్ణ తాజాగా ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో ‘ఆలుమా డోలుమా’ పాటకు తన స్టైల్‌లో కాలు కదిపి అందర్నీ ఆశ్చర్యపరిచాడు..

నటసింహ నందమూరి బాలకృష్ణ తాజాగా ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో ‘ఆలుమా డోలుమా’ పాటకు తన స్టైల్‌లో కాలు కదిపి అందర్నీ ఆశ్చర్యపరిచాడు..
నటసింహ నందమూరి బాలకృష్ణ వయసు పెరిగే కొద్దీ కుర్రాడైపోతున్నాడు. 59 సంవత్సరాల వయసులోనూ సినిమా కోసం ఎంత కష్ట పడుతున్నాడో ఇటీవల విడదలైన ‘రూలర్’ టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం దాదాపు 25 కిలోలు బరువు తగ్గుతున్నాడు బాలయ్య. సినిమాలతో పాటు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ పనులతో పాటు, బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్విర్తిస్తూ బిజీ బిజీగా ఉంటాడు బాలయ్య.
తాజాగా హిందూపురంలో సామూహిక కార్తీక దీపోత్సవం నిర్వహించి వార్తల్లో నిలిచిన బాలయ్య, గురువారం ఉదయం ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు.. తమిళ స్టార్ హీరో ‘తల’ అజిత్ పాటకు బాలయ్య డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి ట్విట్టర్‌లో దర్శనమివ్వడంతో బాలయ్య ఫ్యాన్స్, వీడియోలో ఉంది బాలయ్యేనా లేక ఎవరైనా కుర్ర హీరోనా అని కాసేపు కళ్లు నలుపుకుని మరీ చూశారు. నందమూరి అందగాడి అభినయం చూసి ఆశ్చర్యపోయారు. అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘వేదాళం’లో అనిరుధ్ కంపోజ్ చేసి పాడిన ‘ఆలుమా డోలుమా’ పాట ఓ ఊపు ఊపింది.
తాజాగా ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో బాలయ్య ఈ పాటకు తన స్టైల్‌లో డ్యాన్స్ చేశాడు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘మహానాయకుడు’ సినిమాల్లో ఎన్టీఆర్ తమ్ముడిగా నటించిన ప్రముఖ నటుడు దగ్గుబాటి రాజా ఫ్యామిలీకి చెందిన సంగీత్ ఫంక్షన్‌లో బాలయ్య తమిళ్ పాటకు స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అలాగే ‘పైసా వసూల్’ మూవీలో బాలయ్య పాడిన ‘మావా ఏక్ పెగ్ లా’ పాట పాడుతూ, డ్యాన్స్ చేయడం విశేషం. బాలయ్యతో పాటు ప్రభు, దగ్గుబాటి రాజా కూడా కాలు కదిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం ‘రూలర్’ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న భారీగా విడుదల కానుంది..
Balayya ????#RuleronDEC20 #Ruler ♥️♥️ pic.twitter.com/yX55GaAz0Q
— #RulerOnDec20 ? (@Balayya_Garu) November 28, 2019
#Balayya singing and dancing for #Paisavasool song ??
Mama ek peg la ???
Cutout adirrindi ???#Ruler #Balayya pic.twitter.com/ywyyVUkOK1
— Kumar (@sandeep027) November 28, 2019