Balayya Poem On Drinking
Unstoppable: బాలయ్య.. ‘ఆయనకు కల్మషం తెలియదు.. లోపల ఒకటి పెట్టుకుని బయటకి ఇంకోటి మాట్లాడడు.. భోళా శంకరుడు.. చిన్న పిల్లాడి మనస్తత్వం.. ఈ రోజుల్లో ఆయనలా అంత నిజాయితీగా ఉండడం కష్టం’.. ఈ మాటలు బాలయ్యను దగ్గరినుండి చూసిన వాళ్లు, ఆయనతో కలిసి పని చేసిన వాళ్లు చెప్తుంటారు.
Balakrishna : గుర్రమెక్కిన ‘నటసింహం’.. నందమూరి ‘యువసింహం’..
‘ఆయన కోపిష్టి.. ముక్కు మీద కోపం.. బీపీ వస్తే కొట్టేస్తాడు’ అనే మాటలు అనేవాళ్లు లేకపోలేదు. అలాంటిది బాలయ్యని హోస్ట్‌గా అనుకుని ఒక సెలబ్రిటీ టాక్ షో చెయ్యడం సాధ్యమా?.. దాన్ని సాధ్యం చేసి చూపించింది తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’. ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ అంటూ షో ని ఇండియాలోనే నంబర్ వన్ పొజిషన్‌లో నిలబెట్టింది.
Unstoppable with NBK : బాలయ్య దెబ్బకి ‘థింకింగ్’ మారిపోతుందని ముందే చెప్పాం-‘ఆహా’ టీం
ఇక బాలయ్య కూడా ఎవరూ ఊహించని విధంగా హోస్టింగ్ చేస్తూ.. ఫ్యాన్స్, ఆడియన్స్ అండ్ ఇండస్ట్రీ వర్గాల వారిని అలాగే షోకి వచ్చే సెలబ్రిటీలను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. చాలా ఎనర్జిటిక్‌గా, సరదాగా సాగిపోతుంది బాలయ్య టాక్ షో. సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్‌కి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మీ, రౌడీ హీరో విజయ్ దేవరకొండ వచ్చారు.
Aha : ‘ఆహా’లో తెలుగు ‘ఇండియన్ ఐడిల్’కి విశేష స్పందన!..
ముగ్గుర్నీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ క్వశ్చన్స్ అడిగుతూ అల్లరల్లరి చేసాడు బాలయ్య. తాను మందు తాగేటప్పుడు పాడే పద్యం గురించి పూరి చెప్తూ.. ఓసారి ఆ పద్యం పాడమని అడగడంతో బాలయ్య గుక్కతిప్పుకోకుండా మద్యం మీద పద్యం పాడాడు. ఆ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#HappyKanuma #JaiBalayya
కనుమ పండుగ శుభాకాంక్షలు pic.twitter.com/kKBVltSnjT— మాయాబజార్ ? (@rsloya3969) January 16, 2022