Balayya revealed who is Urvasi who is Rakshasi in his life
BalaKrishna: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ “ఉర్వశివో రాక్షసీవో”. యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్ గా వస్తున్న ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆడియన్స్ లో సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేసిని.
ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కారిక్రమానికి అతిధిగా నందమూరి బాలకృష్ణ హాజరయ్యాడు. ఈ వేడుకలో హీరో శిరీష్ బాలయ్యని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఈ నేపథ్యంలో.. “మీ లైఫ్ లో ఊర్వశి ఎవరో? రాక్షసి ఎవరో?” అని ప్రశ్నిస్తూ విజయశాంతి, సిమ్రాన్, నయనతార, శృతిహాసన్ అంటూ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు.
బాలయ్య.. “ఊర్వశి అంటే నయనతార, రాక్షసి అంటే శృతిహాసన్” అంటూ బదులిచ్చాడు. మరి విజయశాంతి, సిమ్రాన్ అని శిరీష్ ప్రశ్నించగా.. వాళ్ళు రంబ, మేనకలు అంటూ బదులిచ్చాడు. కాగా గీతా ఆర్ట్స్ పథకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.