Balakrishna : అల్లు శిరీష్‌ని నా అన్‌స్టాపబుల్ షోకి పిలిచి.. సీక్రెట్స్ అన్ని లాగుతాను.. ఫ్లాప్ సినిమాలు ప్రేక్షకుల మీద రుద్దొద్దు..

ఇటీవల వస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ.. ''మనిషి జీవితంలో రోజువారీ కావాల్సిన వాటితో పాటు వినోదాన్ని కూడా కోరుకుంటాడు. అలాంటి వినోదాన్ని సినిమాలు అందిస్తున్నాయి. ప్రేక్షకులకి ఎలాంటి సినిమాలు......................

Balakrishna : అల్లు శిరీష్‌ని నా అన్‌స్టాపబుల్ షోకి పిలిచి.. సీక్రెట్స్ అన్ని లాగుతాను.. ఫ్లాప్ సినిమాలు ప్రేక్షకుల మీద రుద్దొద్దు..

Balakrishna speech in Oorvasivo Rakshasivo pre release event

Balakrishna :  అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా రాకేష్‌ శశి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’. ఈ సినిమాని గీత ఆర్ట్స్ రిలీజ్ చేస్తుంది. నవంబరు 4న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఆదివారం నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా బాలకృష్ణ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ అల్లు అరవింద్ ఫ్యామిలీకి, వారి ఫ్యామిలీకి ఉన్న అనుబంధాన్ని తెలియచేశారు.ఇక సినిమా గురించి, అల్లు శిరీష్ గురించి మాట్లాడుతూ.. ”సినిమా ట్రైలర్ చూశాను. మొత్తం మషాలానే ఉంది. కొత్తగా తీస్తున్నారు. ఒకప్పుడు ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రైలర్ లో చూసిన తర్వాత సమాజంలో నిజంగానే అలాగే ఉంది. ఇప్పుడు సహజీవనం, అఫైర్లు పెరిగిపోయాయి. కాలం మారుతోంది. మరి అల్లు శిరీష్ సినిమాలోనేనా లేక బయట కూడా ఇలాగే ఉంటాడా తెలుసుకోవాలి. పిలుస్తాను, నా అన్‌స్టాపబుల్ షోకి పిలిచి అల్లు శిరీష్ నుంచి అన్ని సీక్రెట్స్ లాగుతాను” అని సరదాగా అన్నారు.

Siddharth-Aditiraohydari : సిద్దార్థ్-అదితి నిజంగానే డేటింగ్ లో ఉన్నారా? అదితి పుట్టినరోజు నాడు క్లారిటీ ఇచ్చిన సిద్దార్థ్??

అలాగే ఇటీవల వస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ.. ”మనిషి జీవితంలో రోజువారీ కావాల్సిన వాటితో పాటు వినోదాన్ని కూడా కోరుకుంటాడు. అలాంటి వినోదాన్ని సినిమాలు అందిస్తున్నాయి. ప్రేక్షకులకి ఎలాంటి సినిమాలు అందించాలి అని పరిశ్రమ పెద్దలు, యువతరం దర్శకులు ఆలోచించాలి. వాళ్లకి నచ్చని సినిమాలు వారిపై రుద్దొద్దు”అని అన్నారు.