Siddharth-Aditiraohydari : సిద్దార్థ్-అదితి నిజంగానే డేటింగ్ లో ఉన్నారా? అదితి పుట్టినరోజు నాడు క్లారిటీ ఇచ్చిన సిద్దార్థ్??

తాజాగా అదితిరావు హైదరీ పుట్టినరోజు కావడంతో అదితి సిద్దార్థ్ కౌగిలించుకున్న ఫోటోని సిద్దార్థ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి స్పెషల్ గా విషెష్ చెప్పాడు. ఆ ఫోటోని షేర్ చేసి..............

Siddharth-Aditiraohydari : సిద్దార్థ్-అదితి నిజంగానే డేటింగ్ లో ఉన్నారా? అదితి పుట్టినరోజు నాడు క్లారిటీ ఇచ్చిన సిద్దార్థ్??

Siddharth gives clarity on dating with Aditiraohydari

Siddharth-Aditiraohydari :  హీరో హీరోయిన్స్ చాలా మంది చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తుంటారు. కొంతమంది డేటింగ్, లవ్, పెళ్లి వరకు వెళ్తూ ఉంటారు. కొంతమంది మాత్రం మధ్యలోనే విడిపోతారు. హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు, డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికి పెళ్ళిళ్ళయి, విడిపోయి ప్రస్తుతం సింగిల్ గా ఉన్నారు. గత కొన్నేళ్లుగా వీరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ కలిసి ముంబైలో ఓ రెస్టారెంట్ కి కూడా వెళ్లి మీడియాకి చిక్కారు.

వీరి డేటింగ్ మీద మాత్రం ఇప్పటివరకు వీళ్ళు క్లారిటీ ఇవ్వకపోయినా వీళ్ళు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియా కంట పడుతున్నారు. తాజాగా అదితిరావు హైదరీ పుట్టినరోజు కావడంతో అదితి సిద్దార్థ్ కౌగిలించుకున్న ఫోటోని సిద్దార్థ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి స్పెషల్ గా విషెష్ చెప్పాడు. ఆ ఫోటోని షేర్ చేసి ఓ కొటేషన్ తో పాటు హ్యాపీ బర్త్ డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్ అని పోస్ట్ చేయడంతో వీరి ప్రేమపై మరిన్ని అనుమానాలు వస్తున్నాయి.

Namita : త్వరలో రాజకీయాల్లోకి వస్తాను.. సినిమాల కంటే పాలిటిక్స్ మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ..

సిద్దార్థ్ పోస్ట్ చేసిన దాని ప్రకారం వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా, డేటింగ్ చేస్తున్నారా అని మరింత అనుమానం కచ్చితంగా కలుగుతుంది. అందరికి ఉన్న అనుమానాన్ని సిద్దార్థ్ ఈ ఒక్క పోస్ట్ తో క్లియర్ చేసేశాడని అంటున్నారు. సిద్దార్థ్ పెట్టిన పోస్ట్ కి అదితి కూడా సిద్దూ… అంటూ స్పెషల్ కామెంట్ చేసింది. చూడాలి మరి వీరి ప్రేమ ఎంత దూరం వెళ్తుందో.