BALTI movie release on October 10th in Telugu trailer out
BALTI : షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్, ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బల్టీ. శివలింగం దర్శకత్వంలో తమిళ, మలయాళ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ ఎల్మా పిక్చర్స్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సంస్థ అధినేత ఎన్. ఎథిల్ రాజ్ మాట్లాడుతూ.. తమిళ, మలయాళ భాషల్లో ఘన విజయం సాధించిన బల్టీ (BALTI ) చిత్రాన్ని తెలుగు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ సంగీతాన్ని అందించారని చెప్పారు. షేన్ నిగమ్ అద్భుతంగా నటించారని, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్ నటన ఆకట్టుకుంటుందన్నారు. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ విలన్ పాత్రలో జీవించారన్నారు.
Samantha : హమ్మయ్య ఎట్టకేలకు సమంత మొదలుపెడుతుంది.. చాన్నాళ్ల తర్వాత..
దర్శకుడు ఉన్ని శివలింగం మాట్లాడుతూ .. తమిళనాడు, కేరళ సరిహద్దులో ఉన్న వెలంపాళయంలో జరిగే ఔట్ అండ్ ఔట్ రా రస్టిక్ విలేజ్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుందన్నారు. ఆ ఊరిని శాసించే ముగ్గురు పెద్దలు వారి మధ్య జరిగే వ్యాపార రాజకీయాల్లో నలుగురు కబడ్డీ ప్లేయర్స్ చిక్కుకోవడం, ఆపై వచ్చే ఘర్షణలు, భావోద్వేగాల సమాహారంగా ఈ చిత్రం ఉంటుందన్నారు.