నేను శృతి హాసన్‌ని వద్దంటే.. పవన్ ‘పోరా పని చూసుకో’ అన్నారు..

Bandla Ganesh about Gabbar Singh: బండ్ల గణేష్.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి నిర్మాతగా ఎదిగాడు.. వ్యాపారాలు, రాజకీయాలు, కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచే గణేష్ ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా ఆలీ హోస్ట్ చేస్తున్న ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రామ్‌లో పార్టిసిపెట్ చేశారు బండ్ల. ఆ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తానేమీ కావాలని కాంట్రవర్సీలు చేయనని అనుకోకుండా అవి అలా అయిపోతుంటాయని చెప్పార గణేష్. నిర్మాతగా గ్యాప్ తీసుకోవడానికి గల కారణం వివరిస్తూనే ‘గబ్బర్ సింగ్’ సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటన షేర్ చేసుకున్నారు.
‘హీరోగారి దగ్గరికెళ్లి, బాబు ఈ అమ్మాయిని మారుద్దాం బాబు అన్నాను..ఎందుకు అని అడిగారు.. ఆ అమ్మాయివన్నీ ఫ్లాపులు బాబు అన్నాను..నువ్వన్నీ సూపర్ హిట్లు తీశావా అన్నారు..నాకింకా మాటలు రాలేదు..పోరా పని చూసుకో, ఆ అమ్మాయినే పెట్టు అన్నారు’ అని చెప్పుకొచ్చారు బండ్ల గణేష్..
రాత్రి 8 తర్వాత నా కుటుంబంతోనే ఉంటాను అంటావంట ఏంటని ఆలీ ప్రశ్నించగా.. నేను బతుకుతుందే మా అమ్మా నాన్న కోసం.. అని తల్లిదండ్రుల గురించి తన పిల్లల గురించి చెప్తూ కంటతడి పెట్టుకున్నారు బండ్ల గణేష్.. ఈ ఎపిసోడ్ ఆగస్టు 31న టెలికాస్ట్ కానుంది.