Bandla Ganesh
Drugs Case:టాలీవుడ్ ప్రముఖులపై ఈడీ విచారణ సాగుతున్న సమయంలో ఒక్కసారిగా నిర్మాత బండ్ల గణేశ్ ఈడీ కార్యాలయంలో ప్రత్యక్షమవడం సంచలనంగా మారింది. అయితే తాను పూరి జగన్నాథ్ కోసం వచ్చానని.. ఎవరూ నోటీసులు ఇవ్వలేదంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు గణేష్. డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంటరాగేషన్ సుదీర్ఘంగా కొనసాగుతోండగా.. ఆయనకు సపోర్ట్‌గా మాత్రమే వచ్చినట్లుగా గణేష్ చెప్పారు.
అయితే, డైరెక్టర్‌గా పూరీ, నిర్మాతగా బండ్ల గణేష్ తీసిన పలు సినిమాల గురించి ఈడీ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. పూరీకి బండ్ల గణేష్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్న ఈడీ, బ్యాంక్ స్టేట్మెంట్లు ఆధారంగా.. బండ్ల గణేష్‌ను విచారణకు పిలిచినట్లు చెబుతున్నారు. బండ్ల గణేష్, డైరెక్టర్ పూరీ కాంబినేషన్‌లో టెంపర్, ఇద్దరు అమ్మాయిలతో వంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం నుండి బ్యాంక్ స్టేట్మెంట్లు ఆధారంగా పూరీని సుదీర్ఘంగా విచారిస్తున్నారు ఈడీ అధికారులు.
పూరి జగన్నాథ్ బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన అధికారులు 2015 నుంచి ట్రాన్సాక్షన్స్‌పై పూరీని ప్రశ్నిస్తున్నారు. ఛార్టెడ్ ఎకౌంటెంట్ సమక్షంలో బ్యాంకు ఖాతాల లావాదేవీలను అధికారులకు వివరిస్తున్నారు పూరీ జగన్నాథ్. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేయగా.. 62 మందిని విచారించింది ఈడీ.