Bandla Ganesh: బండ్ల గణేశ్ కీలక నిర్ణయం.. ఫాలోవర్లు షాక్!

సోషల్ మీడియాలో సెన్సెషన్ బండ్ల గణేశ్ ఏం చేసినా అది సెన్సేషనే.. ఆయన మాటలే తూటాల్లా పేలుతుంటాయి. ఇప్పుడు బండ్ల గణేశ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట..

Bandla Ganesh: బండ్ల గణేశ్ కీలక నిర్ణయం.. ఫాలోవర్లు షాక్!

Bandla Ganesh Good Bye To Twitter Soon, Followers Shocked

Updated On : August 14, 2021 / 9:57 PM IST

Bandla Ganesh : సోషల్ మీడియాలో సెన్సెషన్ బండ్ల గణేశ్ ఏం చేసినా అది సెన్సేషనే.. ఆయన మాటలే తూటాల్లా పేలుతుంటాయి. ఇప్పుడు బండ్ల గణేశ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట.. ఆయన ప్రకటనతో ఫాలోవర్లు, అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలంటూ తెగ ప్రశ్నలు సంధిస్తున్నారట. ఇంతకీ బండ్ల గణేశ్ తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటేంటే.. త్వరలోనే ట్విట్టర్ కు గుడ్ బై చెప్పేస్తానని ప్రకటించాడు. నాకు ఎలాంటి కాంట్రవర్సీలు వద్దు.. నా జీవితంలో వివాదాలకు తావివ్వకుండా జీవించాలని అనుకుంటున్నా అంటూ బండ్ల ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ చూసిన ఫాలోవర్లు, ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎందుకు ఇలాంటి బలమైన నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందో చెప్పాలంటూ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. బండ్ల గణేశ్ మాట్లాడితే నవ్వులే.. ఆయన మాట్లాడే ప్రతిమాట వైరల్ అవడం ఖాయం.. సినిమా ఫంక్షన్లలో బండ్ల చేసే సందడి అంతాఇంతా కాదు.. తన మాటలతో సెన్సేషనల్ కామెంట్లతో హీట్ ఎక్కిస్తాడు.


అందుకే బండ్ల కామెంట్లకు అంత క్రేజ్ ఉంటుంది. కమెడియన్ కమ్ ప్రొడ్యూసర్ గా ఆయన సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో అంశంపై మాట్లాడుతూనే ఉంటారు. వ్యక్తిగత విషయాలే కాదు.. సమాజంలో జరిగే అంశాలపై కూడా బండ్ల స్పందిస్తుంటాడు. ఆయన సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆయన ట్విట్టర్ కు గుడ్ బై చెప్పేస్తానంటూ ట్వీట్ చేయడం వైరల్ అవుతోంది.