Bandla Ganesh: ఎన్టీఆర్ కి లైఫ్ ఇచ్చిన సినిమా.. ఇప్పుడు చేస్తే రూ.1000 కోట్లు గ్యారంటీ.. బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్
ఎన్టీఆర్ టెంపర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh).
- V Santhosh Kumar
- Published on- May 24, 2026 / 08:23 PM IST
Bandla Ganesh interesting comments on NTR Temper movie
- ‘టెంపర్’ రూ.1000 కోట్లు రాబట్టేది.
- ఎన్టీఆర్ కెరీర్ మార్చిన సినిమా.
- బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు.
Bandla Ganesh: పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తారక్ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘టెంపర్’ సినిమా గురించి నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. నటుడు రాజా రవీంద్ర ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్‌కు తానే ‘బాద్‌షా’, ‘టెంపర్’ వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చానని గుర్తు చేసుకున్నారు.
Jana Nayagan Release date: విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన వచ్చేసింది
వక్కంతం వంశీ చెప్పిన ‘టెంపర్’ కథ వినగానే పెద్ద హిట్ అవుతుందని నమ్మి, దానిని పూరీ జగన్నాథ్ దగ్గరకు తీసుకెళ్లానని బండ్ల గణేశ్ తెలిపారు. ఈ కథ విన్న పూరీ.. ఇది నీకు మరో ‘గబ్బర్‌సింగ్’ అవుతుందని అన్నారట. ఆ రోజుల్లోనే సంచలనం సృష్టించిన ఈ సినిమాను ఇప్పుడు గానీ తీసుంటే ఖచ్చితంగా రూ.1000 కోట్ల కలెక్షన్లు రాబట్టేదని, ఇందులో తారక్ తన నటనతో చింపి అవతల పడేశాడని గణేశ్ ప్రశంసలు కురిపించారు.
2015లో వచ్చిన ‘టెంపర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో.. ఇకపై ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే సినిమాలు చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చారు. అందుకు తగ్గట్టే వరుస విజయాలు అందుకున్నప్పటికీ, గతేడాది వచ్చిన ‘వార్ 2’ మాత్రం డిజాస్టర్‌గా నిలిచి ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసింది. సాధారణంగా వేరే వాళ్ల కథలతో సినిమాలు చేయని పూరీ జగన్నాథ్, ‘టెంపర్’ కోసం వక్కంతం వంశీ స్టోరీని నమ్మి ఎన్టీఆర్‌కు లైఫ్ టైం హిట్ ఇచ్చారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ఎన్టీఆర్ టెంపర్ సినిమాపై చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
